సినీ పరిశ్రమకు మంచి చేయాలనే తపన సీఎం జగన్ కు ఉందని ప్రముఖ నటుడు చిరంజీవి చెప్పారు. భయపడొద్దని సీఎం తనకు హామీ ఇచ్చారన్నారు. సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టులో చిరంజీవి మీడియాతో మాట్లాడారు.
అమరావతి: సినీ పరిశ్రమకు మంచి చేయాలనే తపన ఏపీ సీఎం Ys Jagan కు ఉందని ప్రముఖ సినీ నటుడు Chiranjeevi చెప్పారు. ప్రభుత్వం నుండి సినీ పరిశ్రమకు అనుకూలమైన జీవో వస్తోందని వారం , 10 రోజుల్లో వస్తోందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.
గురువారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ ముగిసిన తర్వాత చిరంజీవి గన్నవరం ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు.పండుగ పూట తనను ఓ సోదరుడిగా భావించి తనను భోజనానికి పిలిచాడని చిరంజీవి చెప్పారు. తనతో ఆప్యాయంగా మాట్లాడిన తీరు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
గత కొన్ని నెలలుగాTollywood cinemaలో చోటు చేసుకొన్న సమస్యలపై తాము చర్చించినట్టుగా చెప్పారు. ఈ విషయాలపై చర్చించేందుకు తనను సీఎం జగన్ ఆహ్వానించినట్టుగా చిరంజీవి చెప్పారు. మంచి వాతావరణంలో చర్చలు జరిగినట్టుగా చిరంజీవి చెప్పారు. సామాన్యులకు వినోదం అందుబాటులో ఉండాలని ప్రభుత్వం తీసుకొన్న చర్యలు అభినందనీయమన్నారు.
సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వివాదం జఠిలం అవుతున్న తరుణంలో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని జగన్ భావిస్తున్నారని చిరంజీవి చెప్పారు. ఈ విషయమై వన్ సైడ్ గా కాకుండా రెండు వైపులా వాదనలు వినేందుకు తనను జగన్ ఆహ్వానించారన్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ విషయమై ప్రభుత్వం జారీ చేసిన జీవో విషయమై పునరాలోచన చేస్తామని జగన్ తనకు హామీ ఇచ్చారన్నారు.
తాను చెప్పిన విషయాలను సీఎం జగన్ నోట్ చేసుకొన్నారని తెలిపారు. ఈ విషయాలను అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీకి అందించి డ్రాఫ్ట్ తయారు చేయించి సినీ పరిశ్రమకు అందిస్తామన్నారు. సినీ పరిశ్రమ వర్గాలు సంతృప్తి చెందితే కొత్త జీవో జారీ చేస్తామని సీఎం జగన్ తమకు హామీ ఇచ్చారన్నారు. చిన్న సినిమాల కోసం ఐదో షో వేయడానికి అనుమతించాలని తాను జగన్ దృష్టికి తీసుకు రాగా ఆయన కూడా సానుకూలంగా స్పందించారని చిరంజీవి చెప్పారు.
ఎగ్జిబిటర్లు ఇబ్బందులు పడుతున్నారని తాను సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చానని చిరంజీవి చెప్పారు. సినీ పరిశ్రమ బయటకు కన్పించేంత గ్లామర్ ఫీల్డ్ కాదని చిరంజీవి అభిప్రాయపడ్డారు.కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమ లో కార్మికులు దయనీయ పరిస్థితి లో గడిపారన్నారు. సినిమాలు నిర్మిస్తేనే కార్మికులకు పూట గడవని పరిస్థితులున్నాయని ఆయన వివరించారు.సినీ పరిశ్రమ సాధక బాధలను సీఎం దృష్టికి తీసుకొచ్చానన్నారు.
సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఎవరూ లేని కూడా కామెంట్స్ చేయొద్దని చిరంజీవి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.పెద్ద బడ్జెట్ సినిమానా లేక చిన్న సినిమానా అన్న భేదం లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నానని చిరంజీవి చెప్పారు.త్వరలోనే కమిటీ సమావేశనికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వస్తామన్నారు. ఒకరిని రావాలంటే ఒకడినే వస్తానన్నారు. లేదా అందరిని తీసుకుని రావాలని కోరితే అందరితో కలిసి వస్తానని చిరంజీవి తెలిపారు.
త్వరలోనే కమిటీ సమావేశనికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వస్తామన్నారు. ఒకరిని రావాలంటే ఒకడినే వస్తానన్నారు. లేదా అందరిని తీసుకుని రావాలని కోరితే అందరితో కలిసి వస్తానని చిరంజీవి తెలిపారు. ఈ సమావేశంలో సినీ రంగానికి చెందిన సమస్యలు పరిష్కరించాలని తాను నిర్మాణాత్మక సూచనలు చేసినట్టుగా చిరంజీవి చెప్పారు. సీఎం జగన్ తో జరిగిన సమావేశం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.