రండి ఆచార్య అంటూ 'చిరు'కు జగన్ ఆహ్వానం: ఏపీ సీఎంతో ముగిసిన మెగాస్టార్ భేటీ

Published : Jan 13, 2022, 02:45 PM ISTUpdated : Jan 13, 2022, 02:57 PM IST
రండి ఆచార్య అంటూ 'చిరు'కు జగన్ ఆహ్వానం: ఏపీ సీఎంతో ముగిసిన మెగాస్టార్ భేటీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తో సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి గురువారం నాడు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమలో చోటు చేసుకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందని సమాచారం.  

అమరావతి:ఆంధ్రప్రదేశ్ సీఎంYs Jagan తో సినీ నటుడు Chiranjeevi గురువారం నాడు భేటీ అయ్యారు. సుమారు గంట 20 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. Cinema పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. సీఎం జగన్ తో lunch భేటీ సందర్భంగా పలు అంశాలపై  చిరంజీవి  జగన్ మధ్య చర్చ జరిగింది.

ఇవాళ మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయానికి చిరంజీవి చేరుకోగానే ఇంట్లో నుండి బయటకు వస్తూ రండి ఆచార్య అంటూ జగన్ ఆప్యాయం గా పలకరించారు. దీంతో చిరంజీని జగన్ పరస్పరం ఆత్మీయ ఆలింగనం చేసుకొన్నారు. సీఎం జగన్ ను  చిరంజీవి శాలువా కప్పి సన్మానించారు. తన వెంట తెచ్చిన బోకేను సీఎం కు అందించారు. చిరంజీవిని జగన్ తన వెంట ఇంట్లోకి తీసుకెళ్లారు. tollywood cinema సమస్యలను చిరంజీవి జగన్ దృష్టికి తీసుకెళ్లారు.మరోసారి సమావేశం కావాలని  ఈ భేటీ లో నిర్ణయం తీసుకొన్నారు. తర్వాత జరిగే మీటింగ్ లో సినీపరిశ్రమ, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదానికి  వివాదానికి స్వస్తి పలకాని నిర్ణయం తీసుకొన్నారు.

సినీ పరిశ్రమ బిడ్డగానే సీఎం జగన్ తో సమావేశానికి వచ్చినట్టుగా చిరంజీవి చెప్పారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు ఆయనతో భేటీ కానున్నట్టుగా చిరంజీవి తెలిపారు. ఏపీ సీఎం జగన్ తో భేటీ కావడానికి ముందు గన్నవరం ఎయిర్‌పోర్టులో చిరంజీవి మీడియాతో మాట్లాడారు.

Andhra pradeshప్రభుత్వం ఇటీవల కాలంలో cinema టికెట్ల దరలను తగ్గించింది. సినిమా Tickets ధరలను తగ్గించడంపై సినీ పరిశ్రమలోని ప్రముఖులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.  అఖండ సినిమా సక్సెస్ మీట్ లో ఏపీ రాష్ట్రంలో సినీ పరిశ్రమ గోడును వినిపించుకొనేవారెవరున్నారని సినీ నటుడు బాలకృష్ణ ప్రశ్నించారు. Balakrishna వ్యాఖ్యలు చేసిన మరునాడే చిరంజీవితో జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు విషయమై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి Perni nani తో ప్రముఖ దర్శకుడు Ramgopal Varma సోమవారం నాడు భేటీ అయ్యారు.  ఈ సమావేశంలో పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. తన అభిప్రాయాలను వర్మ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ వాదనను కూడా ఏపీ మంత్రి నాని రామ్‌గోపాల్ వర్మ దృష్టికి తీసుకొచ్చారు.

సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై ఎవరైనా తమతో చర్చించేందకు తాము సిద్దంగా ఉన్నామని మంత్రి నాని చెప్పారు. రామ్‌గోపాల్ వర్మ మాదిరిగానే ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాలను నిరభ్యంతరంగా ప్రభుత్వానికి చెప్పొచ్చన్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల తగ్గింపు అంశానికి సంబంధించి నిర్మాతలు ఇంకా ప్రభుత్వంతో చర్చించలేదు. onilne టికెట్ వ్యవహరానికి సంబంధించి మంత్రి నానితో నిర్మాతలు భేటీ అయ్యారు. ఆ తర్వాత సినిమా టికెట్ ధరల తగ్గింపు అంశంపై మాత్రం నిర్మాతలు ప్రభుత్వంతో ఇంకా భేటీ కాలేదు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తే తెలంగాణలో మాత్రం సినిమా టికెట్ ధరల పెంపు విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సినీ పరిశ్రమకు అనుకూలంగా తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకొంది. సినిమా టికెట్ ధరల విషయమై తాను ఏపీ మంత్రులతో మాట్లాడుతానని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి Talasani Srinivas Yadav చెప్పారు.

రాష్ట్రంలో corona వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లను నడపాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంతో ఇబ్బంది పడే వాళ్లంతా తమ పినిమాలను వాయిదా వేసుకోవచ్చని మంత్రి నాని సలహా ఇచ్చారు. 

మరో వైపు నెల్లూరు జిల్లాకు చెందిన  వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సినీ పరిశ్రమకు చెందిన వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.ఈ వ్యాఖ్యలను సినీ పరిశ్రమ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu