ఆ గ్రామాలతో కలిపి మరో జిల్లా:ఏపీలో మరో కొత్త జిల్లాకు జగన్ సర్కార్ ప్లాన్

By narsimha lode  |  First Published Apr 5, 2022, 1:00 PM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ముంపు గ్రామాలను కలిపి  కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ యోచిస్తుంది. 


అమరావతి: Andhra Pradesh రాష్ట్రంలో మరో జిల్లా ఏర్పాటు విషయాన్ని YS Jagan సర్కార్ పరిశీలిస్తుంది. రంపచోడవరం, పోలవరం ముంపు గ్రామాలను కలుపుతూ New District ఏర్పాటు చేయాలని కూడా సీఎం జగన్ యోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర సమాచారా శాఖ మం్రి పేర్నినాని కూడా ధృవీకరించారు.

ఏపీ రాష్ట్రంలో 13 జిల్లాలకు అదనంగా మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం., ఏపీలో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది జనవరి 26 న రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే  కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఇటీవలనే ఫైనల్ Notification జారీ చేసింది.ఈ నోటిఫికేషన్ ఆధారంగా కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. ఈ నెల 4వ తేదీన కొత్త జిల్లాల కార్యాలయాలను సీఎం జగన్ ప్రారంభించారు.

Latest Videos

పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలను విభజించింది. ఈ ప్రకారం.. 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ..  విస్తీర్ణం దృష్ట్యా అరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని మాత్రం రెండు జిల్లాలుగా విభజించింది. దీంతో మొత్తం 26 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. వాటిపై సమీక్షించిన ప్రభుత్వం స్వల్ప మార్పులతో కొత్త జిల్లాలను ఖరారు చేసింది.

ప్రాథమిక నోటిఫికేషన్‌లో ప్రతిపాదించిన మేరకు కొత్త జిల్లాల పేర్లను ప్రభుత్వం దాదాపు అలాగే ఉంచింది. తిరుపతి కేంద్రంగా ప్రతిపాదించిన బాలాజీ జిల్లాను మాత్రం అక్కడి ప్రజల కోరిక మేరకు తిరుపతి జిల్లాగా పేరు మార్చింది. మన్యం జిల్లాకు బదులుగా పార్వతీపురం మన్యం అనే పేరు ఖరారు చేశారు. మొత్తం 72 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు.  చంద్రబాబు వినతి మేరకు కుప్పం ప్రాంతాన్ని రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు


1. శ్రీకాకుళం జిల్లా
జిల్లా కేంద్రం : శ్రీకాకుళం
మొత్తం మండలాలు: 30
రెవెన్యూ డివిజన్లు: పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం, 

2. విజయనగరం జిల్లా
జిల్లా కేంద్రం: విజయనగరం
మొత్తం మండలాలు: 27
రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

3. పార్వతీపురం మన్యం జిల్లా
జిల్లా కేంద్రం: పార్వతీపురం
మొత్తం మండలాలు: 14
రెవెన్యూ డివిజన్లు: పాలకొండ, పార్వతీపురం

4. అల్లూరి సీతారామరాజు జిల్లా
జిల్లా కేంద్రం: పాడేరు
మండలాలు: 22
రెవెన్యూ డివిజన్లు: పాడేరు, రంపచోడవరం

5. విశాఖపట్నం జిల్లా
జిల్లా కేంద్రం: విశాఖపట్నం
మొత్తం మండలాలు: 11
రెవెన్యూ డివిజన్లు: భీమునిపట్నం(కొత్త), విశాఖపట్నం

6. అనకాపల్లి జిల్లా
జిల్లా కేంద్రం: అనకాపల్లి
మొత్తం మండలాలు: 24
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం, అనకాపల్లి

7. కాకినాడ జిల్లా
జిల్లా కేంద్రం: కాకినాడ
మొత్తం మండలాలు: 21
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం, కాకినాడ

8. కోనసీమ జిల్లా
జిల్లా కేంద్రం: అమలాపురం
మొత్తం మండలాలు: 22
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం, అమలాపురం

9. తూర్పు గోదావరి జిల్లా
జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
మొత్తం మండలాలు: 19
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం, కొవ్వూరు

10. పశ్చిమ గోదావరి జిల్లా
జిల్లా కేంద్రం: భీమవరం
మొత్తం మండలాలు: 19
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, భీమవరం (కొత్త)

11. ఏలూరు జిల్లా
జిల్లా కేంద్రం: ఏలూరు
మొత్తం మండలాలు: 28
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు

12. కృష్ణా జిల్లా
కేంద్రం: మచిలీపట్నం
మొత్తం మండలాలు: 25
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు(కొత్త)

13. ఎన్టీఆర్‌ జిల్లా
జిల్లా కేంద్రం: విజయవాడ
మొత్తం మండలాలు: 20
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, నందిగామ (కొత్త), తిరువూరు (కొత్త)

14. గుంటూరు జిల్లా
జిల్లా కేంద్రం: గుంటూరు
మొత్తం మండలాలు: 18
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు, తెనాలి

15. బాపట్ల జిల్లా
జిల్లా కేంద్రం: బాపట్ల
మొత్తం మండలాలు: 25
రెవెన్యూ డివిజన్లు : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

16. పల్నాడు జిల్లా
జిల్లా కేంద్రం: నరసరావుపేట
మొత్తం మండలాలు: 28
రెవెన్యూ డివిజన్లు: గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

17. ప్రకాశం జిల్లా
జిల్లా కేంద్రం: ఒంగోలు
మొత్తం మండలాలు: 38
రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)

18. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
జిల్లా కేంద్రం: నెల్లూరు
మొత్తం మండలాలు: 38
రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు , ఆత్మకూరు, కావలి, కందుకూరు

19. కర్నూలు జిల్లా
జిల్లా కేంద్రం: కర్నూలు
మొత్తం మండలాలు: 26
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

20. నంద్యాల జిల్లా
జిల్లా కేంద్రం: నంద్యాల
మొత్తం మండలాలు: 29
రెవెన్యూ డివిజన్లు : నంద్యాల, డోన్‌ (కొత్త), ఆత్మకూరు (కొత్త)

21. అనంతపురం జిల్లా
జిల్లా కేంద్రం: అనంతపురం
మొత్తం మండలాలు: 31
రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్‌ (కొత్త)

22. శ్రీ సత్యసాయి జిల్లా
జిల్లా కేంద్రం: పుట్టపర్తి
మొత్తం మండలాలు: 32
రెవెన్యూ డివిజన్లు : ధర్మవరం, పెనుగొండ, పుట్టపర్తి (కొత్త), కదిరి

23. వైఎస్సార్‌ కడప జిల్లా
జిల్లా కేంద్రం: కడప
మొత్తం మండలాలు 36
రెవెన్యూ డివిజన్లు : కడప, జమ్మలమడుగు, బద్వేలు

24. అన్నమయ్య జిల్లా
జిల్లా కేంద్రం: రాయచోటి
మొత్తం మండలాలు: 30
రెవెన్యూ డివిజన్లు : రాజంపేట, రాయచోటి(కొత్త), మదనపల్లి

25. చిత్తూరు జిల్లా
జిల్లా కేంద్రం: చిత్తూరు
మొత్తం మండలాలు: 31
రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు, పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త), నగరి (కొత్త)

26. తిరుపతి జిల్లా
జిల్లా కేంద్రం: తిరుపతి
మొత్తం మండలాలు: 34
రెవెన్యూ డివిజన్లు : సూళ్లూరుపేట, గూడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి (కొత్త)

 

 

click me!