ఒంటరి యువతిపై అత్యాచార యత్నం.. ప్రతిఘటించడంతో హత్య.. సర్పంచ్ కొడుకు దారుణం...

Published : Apr 05, 2022, 10:39 AM IST
ఒంటరి యువతిపై అత్యాచార యత్నం.. ప్రతిఘటించడంతో హత్య.. సర్పంచ్ కొడుకు దారుణం...

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ కామాంధుడు ఒంటరిగా ఉన్న యువతిపై అర్థరాత్రి అత్యాచారానికి ప్రయత్నించాడు. దీనికి ఆమె ప్రతిఘటించడంతో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. 

పశ్చిమ గోదావరి జిల్లా : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. ఒంటరిగా అమ్మమ్మతో కలిసి ఉంటున్న యువతి మీద rape attemptకి పాల్పడ్డాడు. ఆ యువకుడి ప్రయత్నానికి ఆమె ప్రతిఘటించడంతో murder చేసి పరారయ్యాడు.  పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం పల్లిపాలెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చెప్పాల కళ్యాణి (19) తన అమ్మమ్మ ఒడుగు దుర్గ వద్ద ఉంటుంది. తండ్రి మృతి చెందడంతో తల్లి ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంది. గ్రామ sarpanch తిరుమలశెట్టి శకుంతల, భాస్కర రావుల పెద్ద కుమారుడు సాయి ప్రసాద్ అలియాస్ నాని ఆదివారం అర్ధరాత్రి కళ్యాణి నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు.  మెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీనికి ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెను హత్య చేసి పారిపోయాడు.

శబ్దాలకు వేరొక గదిలో నిద్రిస్తున్న అమ్మమ్మ దుర్గ వచ్చి తలుపులు తీసి చూడగా అప్పటికే కళ్యాణి రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఆమె షాక్కు గురయింది. వెంటనే తేరుకుని పెద్దగా కేకలు వేసింది. సర్పంచ్ కుమారుడు సాయి ప్రసాద్ ఆ ఇంటి నుంచి పారిపోవడం చూసిన స్థానికులు ఆమెకు చెప్పారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపడంతో గ్రామ పెద్దలు రాజీ కుదిర్చి యువతి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు స్మశానానికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు దహన సంస్కారాలు అడ్డుకుని  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి మహిళా గొంతుకోసి murder చేసేందుకు ప్రయత్నించిన ఆగంతకుడి కేసును Sanath Nagar పోలీసులు చేధించారు. తన మిత్రుడైన Junior Artistకు 7 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి మహిళ  భర్తే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు  గుర్తించారు. వివరాలను సనత్ నగర్ సిఐ వెల్లడించారు. గత నెల 30న అర్ధరాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో భరత్ నగర్ కాలనీ మహేశ్వరినగర్ లో నివసించే స్పందన (26)ను గుర్తు తెలియని వ్యక్తి.. ముఖానికి మాస్కు ధరించి.. ఇంట్లోకి చొరబడి కత్తితో గొంతుకోసి హత్య చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. 

ఆ సమయంలోనే ఇంట్లోనే ఉన్న భర్త వేణుగోపాల్ వారి ఏడాదిన్నర వయస్సున్న కుమార్తెను తీసుకుని వరండాలోకి వెళ్ళాడు. అప్పుడే అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించాడు. క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించగా ఆమె కోలుకుంది. కేసును ఛేదించడం లో సీసీ ఫుటేజీ కీలకం అయింది.

గతంలో ఓసారి విఫలం…
స్పందన తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో వేణుగోపాల్ అనుమానం పెంచుకున్నాడు. హత్య చేయాలని ఆలోచనతో యూసుఫ్ గూడాలో ఉండే మిత్రుడు, జూనియర్ ఆర్టిస్ట్ తిరుపతికి సూపారీ ఇచ్చాడు. నిరుడు డిసెంబర్లో స్పందన మెట్టినిల్లు మెదక్ జిల్లా చేగుంటలో ఉన్నప్పుడు తిరుపతి కత్తితో దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. తిరుపతి ఇచ్చిన సమాచారం మేరకు వేణుగోపాల్ ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బీజేపీచేస్తున్న కుట్రను ఎదుర్కోడానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాం | YS Sharmila | Asianet News Telugu
Varudu Kalyani Comments on Pawan Kalyan: డైలాగ్స్ వద్దు చర్యలు తీసుకోండి | Asianet News Telugu