విద్యా విధానంలో సంస్కరణలు: ప్రీ స్కూల్స్ పథకం అమలుకు జగన్ సర్కార్ ప్లాన్

By narsimha lodeFirst Published May 19, 2020, 12:14 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ స్కూల్స్ పథకాన్ని తీసుకురానున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ  స్కీమ్ ను అమలు చేయాలని జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ స్కూల్స్ పథకాన్ని తీసుకురానున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ  స్కీమ్ ను అమలు చేయాలని జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ స్కూల్స్ స్కీమ్ ను అమలు చేయనున్నారు. అయితే తొలి విడతగా గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. నాలుగున్నర ఏళ్లు, ఐదేళ్ల పిల్లలకు ప్రీ స్కూల్ స్కీమ్ లో భాగంగా ఆడ్మిషన్ ఇవ్వనున్నారు.

also read:ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఎదురుదెబ్బ... సుప్రీంకోర్టుకు వెళతామన్న ఏపి విద్యామంత్రి

పిల్లల్లోని ప్రతిభను వెలికితీయడంతో పాటు మ్యాథ్స్ సబ్జెక్టుపై విద్యార్థులకు బోధిస్తారు.విద్యార్థుల్లో ప్రతిభ ఆధారంగా ఒకటో తరగతిలోకి ప్రవేశం కల్పిస్తారు. సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద రాష్ట్రంలోని 3400 స్కూళ్లలో ప్రీ స్కూల్స్ విధానాన్ని అమలు చేయనున్నారు.ప్రీ స్కూల్స్ లో ఆడ్మిషన్లు పొందే విద్యార్థులకు అవసరమైన సిలబస్ ను రూపొందించాలని జగన్ అధికారులను ఆదేశించారు. 

also read:లాక్‌డౌన్‌లోనూ టీటీడీకీ ఆన్‌లైన్ లో రూ. 90 లక్షల ఆదాయం

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1వతరగతి నుండి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేయాలని ఈ నెల 13వ తేదీన ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.

click me!