ఏపీలో తగ్గని కరోనా విజృంభణ: కేసుల సంఖ్య 2339, మొత్తం మరణాలు 52

Published : May 19, 2020, 11:18 AM IST
ఏపీలో తగ్గని కరోనా విజృంభణ: కేసుల సంఖ్య 2339, మొత్తం మరణాలు 52

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో రెండు మరణాలు సంభవించాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కావడం లేదు. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 9,739 శాంపిల్స్ ను పరీక్షించగా 57 మందికి కోవిడ్ -19 పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 69 మంది కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకున్నారు. 

మొత్తం ఏపీలో కరోనా వైరస్ కేసులు 2339కి చేరుకున్నాయి. 1596 మంది చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా, 691 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనా వైరస్ తో మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 52కు చేరుకుంది. గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు, చిత్తూరు జిల్లాలో మరొకరు మరణించారు. 

 

కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చినవారిలో ఆరుగురికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వారిలో ఐదుగురు చిత్తూరు జిల్లాకు చెందినవారు కాగా, ఒక్కరు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు. 

 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు