ఏపీకి మేలు జరగాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలి: ధర్మాన కృష్ణదాస్

Published : Oct 07, 2023, 01:17 PM IST
ఏపీకి మేలు జరగాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలి: ధర్మాన కృష్ణదాస్

సారాంశం

Visakhapatnam: ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలో వైఎస్ఆర్సీపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌ని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మంచి జ‌ర‌గాలంటే మ‌ళ్లీ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు కోసం త‌మ ప్ర‌భుత్వం అన్ని ర‌కాల సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న‌ద‌ని తెలిపారు.   

Former deputy chief minister Dharmana Krishnadas: ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలో వైఎస్ఆర్సీపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌ని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మంచి జ‌ర‌గాలంటే మ‌ళ్లీ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు కోసం త‌మ ప్ర‌భుత్వం అన్ని ర‌కాల సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న‌ద‌ని తెలిపారు. మ‌రోసారి వైఎస్ఆర్సీపీ ప్ర‌జ‌ల‌రు అండ‌గా నిలవాల‌ని కోరారు.

విశాఖపట్నంలో ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ బాగు కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. సార్వకోటలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కృష్ణదాస్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కొనసాగడంతోపాటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే జ‌గ‌నే ముఖ్యమంత్రిగా కొనసాగించాలన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటి తలుపు తట్టి నాలుగేళ్లలో చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరును గత టీడీపీ ప్రభుత్వంతో పోల్చిచూడాలని అన్నారు.

వాలంటీర్‌ వ్యవస్థపై జగన్‌ మోహన్‌రెడ్డికి పూర్తి విశ్వాసం ఉందని కృష్ణదాస్‌ సమావేశంలో చెప్పారు. వైఎస్ఆర్సీపీ బీసీ సెల్‌ జోనల్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై వాలంటీర్లు ప్రచారం చేయాలన్నారు. వచ్చే ఆరు నెలలు పార్టీకి చాలా కీలకమని తెలిపారు. ఈ సమావేశానికి వందలాది మంది పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు, ప్రత్యేకించి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. మ‌రోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP Food Commission Chairman: మిమ్మల్ని ఏమైనా అంటే..! కోపాలు తాపాలు... చేసేవి పాపాలు | Asianet Telugu
Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు