తిరుపతిలో దారుణం.. హోటల్ గదిలో భార్య, బావమరిదిని హత్య చేసిన మహారాష్ట్ర వాసి..

By Asianet News  |  First Published Oct 7, 2023, 12:31 PM IST

తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ గదిలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు జంట హత్యలు జరిగాయి. మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్య, బావమరిదిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


తిరుపతిలో దారుణం జరిగింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తిరుపతికి వచ్చి, ఇక్కడి ఓ ప్రైవేట్ హోటల్ గదిలో భార్యను, బావమరిదిని ఘోరంగా హతమార్చాడు. అనంతరం పోలీసు స్టేషన్ ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

టీచర్ ను క్లాసులోనే కాల్చిన స్టూడెంట్లు.. మరో 39 బుల్లెట్లు దించుతామని వార్నింగ్ ఇస్తూ వీడియో..

Latest Videos

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన యువరాజ్, తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల యాత్రకు వచ్చారు. ఇక్కడ బస చేసేందుకు నగరంలోని కపిలతీర్థం సర్కిల్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ హెటల్ లో గది తీసుకొని గురువారం ఉన్నారు. ఆ గదిలో యువరాజ్ భార్య మనీషా, బావమరిది హర్షవర్థన్, ఇద్దరు పిల్లలు బస చేశారు.

నర్సరీ చదివే బాలికపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారం.. స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా ఘటన..

ఈ క్రమంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో యువరాజ్ తన భార్య, బావమరిదిని కత్తితో పొడిచి చంపాడు. అనంతరం నిందితుడు అలిపిరి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. దీనిపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే కుటుంబ కలహాలే జంట హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

click me!