దొంగ ఓట్లపై సీఈసీకి జగన్ ఫిర్యాదు

By narsimha lodeFirst Published Feb 4, 2019, 11:44 AM IST
Highlights

కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  సోమవారం నాడు కలిశారు. ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  ఓటరు జాబితాలో నకిలీ ఓటర్ల జాబితాలో అవకతవకలు,  నకిలీ ఓట్లపై జగన్ ఫిర్యాదు చేశారు.


న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  సోమవారం నాడు కలిశారు. ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  ఓటరు జాబితాలో నకిలీ ఓటర్ల జాబితాలో అవకతవకలు,  నకిలీ ఓట్లపై జగన్ ఫిర్యాదు చేశారు.

ఏపీ రాష్ట్రంలోని  పలు జిల్లాల్లో  ఓటర్ల జాబితాలో  అవకతవకలు చోటు చేసుకొన్నాయని  వైసీపీ ఆరోపణలు చేస్తోంది.  ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు వైఎస్ జగన్ ఆదివారం మధ్యాహ్నం హైద్రాబాద్‌ నుండి  ఢిల్లీకి  బయలుదేరారు. 

సోమవారం నాడు ఉదయమే జగన్  పార్టీ నేతలతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు  వినతిపత్రం సమర్పించారు.  ఓటరు జాబితాలో అధికార పార్టీ అవకతవకలకు పాల్పడుతోందని  వైసీపీ  ఆరోపణలు చేస్తోంది.  ఇదే విషయమై  కేంద్ర ఎన్నికల సంఘానికి జగన్ ఫిర్యాదు చేశారు.


 

click me!