మరోసారి వివాదంలో చింతమనేని.. వృద్ధుడిపై వీరంగం

By ramya NFirst Published Feb 4, 2019, 11:09 AM IST
Highlights

దెందులూరు ఎమ్మెల్యే చితమనేని మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో.. వీరంగం సృష్టించారు. 

దెందులూరు ఎమ్మెల్యే చితమనేని మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో.. వీరంగం సృష్టించారు. వృద్ధుడు అని కూడా చూడకుండా..  ఓ వ్యక్తిపై బూతుపురాణం అందుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. దెందులూరు నియోజకవర్గం విజరాయి గ్రామంలో ఆదివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కాగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతమనేని హాజరై.. ఆయనే స్వయంగా పింఛన్లు అందజేశారు.

కాగా.. అందరిలాగానే పింఛను తీసుకోవడానికి గ్రామానికి చెందిన సుబ్బారావు(75) అనే వృద్ధుడు అక్కడికి వచ్చాడు. కాగా.. అతని కుమారులు వైసీపీకి చెందిన వారుకావడంతో.. ఆ వృద్ధుడిపై ఎమ్మెల్యే బూతుపురాణం అందుకున్నాడు. సుబ్బారావుపై చింతమనేని ఒక్కసారిగా రెచ్చిపోయారు. ‘నీ కొడుకులు వైఎస్సార్‌సీపీలో తిరుగుతుంటే పింఛన్‌ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా’ అంటూ చింతమనేని వృద్ధుడిపై విరుచుకుపడ్డారు. 

తన తండ్రిని అవమానించటంపై అక్కడే ఉన్న సుబ్బారావు కొడుకులు నిలదీయడంతో చింతమనేని దౌర్జన్యానికి దిగారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజికమాధ్యమాల్లో వైరల్ గా మారడంతో చింతమేనని మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 

click me!