చంద్రబాబు పాలనలో ట్రాక్టర్ల కొనుగోలులో అవినీతి: గుంటూరులో వైఎస్ఆర్ యంత్రసేవా పథకం ప్రారంభం

Published : Jun 07, 2022, 12:03 PM ISTUpdated : Jun 07, 2022, 04:33 PM IST
 చంద్రబాబు పాలనలో ట్రాక్టర్ల కొనుగోలులో అవినీతి: గుంటూరులో వైఎస్ఆర్ యంత్రసేవా పథకం ప్రారంభం

సారాంశం

గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ యంత్రసేవా పథకం కింద లబ్దిదారులకు ట్రాక్టర్లు,హర్వెస్టర్లను ఏపీ సీఎం జగన్ అందించారు. వైఎస్ఆర్ యంత్రసేవా పథకాన్ని జగన్  ప్రారంభించారు. చంద్రబాబు పాలనకు తమ పాలనకు మధ్య తేడాను చూడాలని ఆయన రైతులను కోరారు.  

గుంటూరు:chandrababu సీఎంగా ఉన్న సమయంలో అరకొరగానే  రైతులకు ట్రాక్టర్లు ఇచ్చారని ఏపీ సీఎం YS Jagan విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో  Tractorsకొనుగోలులో స్కామ్ లు జరిగాయని ఆయన విమర్శించారు.  

Guntur జిల్లాలో మంగళవారం నాడు YSR Yantra Seva Scheme ద్వారా ట్రాక్టర్లు, హార్వెస్టర్ల పంపిణీని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి రూ. 175 కోట్ల సబ్సిడీని సీఎం జగన్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.రైతుల ఇష్టం మేరకు ట్రాక్టర్లు కొనుగోలు చేసుకొనే స్వేచ్ఛను ఇచ్చామని సీఎం జగన్ గుర్తు చేశారు.  చంద్రబాబు పాలనకు ప్రస్తుతం తమ ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను గుర్తించాలని ఆయన కోరారు. ప్రతి గ్రామంలో విత్తనం నుండి పంట విక్రయం వరకు ప్రతి దశలోనూ రైతుకు తోడుగా ఉండేలా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. Farmers కు సహాయంగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని సీఎం చెప్పారు.  ట్రాక్టర్లతో పాటు రైతులకు ఉపయోగపడే వనిముట్లను అందుబాటులో ఉంచామని సీఎం వివరించారు.

 గ్రామాల్లోనే తక్కువ ధరలోనే  పనిముట్లు అందుబాటులో వచ్చేందుకు రైతులతోనే గ్రూపులు ఏర్పాటు చేసి ఆ రైతులకే ప్రభుత్వం తరపున 40 శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. మరో 50 శాతం రుణాలు తక్కువ వడ్డీకే బ్యాంకులతో మాట్లాడి మంజూరు చేయిస్తున్నామని సీఎం వివరించారు.

 రైతులు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలు వాళ్లకు గ్రామంలో వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లతో సహా ఉపకరణాలన్నీ కూడా ఆర్బీకే పరిధిలోనే సరసమైన ధరలకే అందుబాటులో ఉంచే గొప్ప కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టినట్టుగా చెప్పారు.

ఇందులో భాగంగానే ఈరోజు రూ.2016 కోట్లతో ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ రూ.15 లక్షలు విలువగల 10,750 వైయస్సార్‌ యంత్రసేవా కేంద్రాలను స్ధాపించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కోక్కటి రూ.25 లక్షలు విలువ గల కంబైన్ హార్వెస్టర్లతో కూడిన 1615 క్లస్టర్‌ స్ధాయి యంత్రసేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

ఇవాళ ఆర్భీకే స్ధాయి యంత్రసేవాకేంద్రాలకు 3800 ట్రాక్టర్లను అందజేస్తున్నామని సీఎం చెప్పారు.  రాబోయే రోజుల్లో 10,750 రైతు భరోసా కేంద్రాలన్నింటికీ కూడా ఈ సేవలన్నీ విస్తరిస్తాయన్నారు.. అందులో భాగంగా ఈ రోజు 3,800 ట్రాక్టర్లతో పాటు 1140 ఆర్బీకే స్ధాయి యంత్ర సేవా కేంద్రాలకు ఇతర వ్యవసాయ యంత్రపరికరాలను కూడా అందిస్తున్నామన్నారు. క్లస్టర్‌ స్దాయి యంత్రసేవా కేంద్రాలకు 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీ కూడా జరుగుతుందన్నారు.

5,260 రైతు గ్రూపుల బ్యాంకుల ఖాతాల్లోకి రూ.590 కోట్లు విలువచేసే సామాన్లుకు సంబంధించిన.  రూ.175 కోట్ల సబ్సిడీని కూడా ఈ కార్యక్రమంలోనే వారి ఖాతాల్లోకి బటన్‌ నొక్కి జమ చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పంపిణీ చేస్తున్న వ్యవసాయ యంత్రపరికరాలన్నీ కలిపి ఇప్పటికి 6780 ఆర్బీకేల్లో అందుబాటులోకి తెచ్చామన్నారు.

 మరో 391 క్లస్టర్‌ స్దాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లకు దాదాపు రూ.700 కోట్ల విలువ గల ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసినట్లవుతుందని సీఎం చెప్పారు. రాబోయే రోజుల్లో సంవత్సరం తిరక్క మునుపే రూ.2016 కోట్ల విలువ చేసే వ్యవసాయ పరికరాలను ఆర్బీకేల పరిధిలో రైతుల చేతుల్లో పెట్టబోతున్నామన్నారు జగన్. ఇవన్నీ దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతోనే సాధ్యమైందన్నారు.. ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నట్టుగా సీఎం చెప్పారు.

PREV
click me!

Recommended Stories

నగరి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో CM Chandrababu Power Full Speech | Asianet News Telugu
అమెరికాఅనుభవాలతో సమర్థవంతమైన ఎమ్మెల్యేగా పనిచేస్తాడని ఆశిస్తున్నా: Chandrababu | Asianet News Telugu