రాజకీయ కోణంలో పనిచేసే శాసనమండలి అవసరమా: జగన్

By narsimha lode  |  First Published Jan 27, 2020, 5:17 PM IST

ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసేందుకు శాసనమండలి ఉందని  ఏపీ సీఎం వైఎస్ జగన్  అభిప్రాయపడ్డారు



అమరావతి: ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసేందుకు శాసనమండలి ఉందని  ఏపీ సీఎం వైఎస్ జగన్  అభిప్రాయపడ్డారు. రాజకీయ కోణంలో  పనిచేసే ఇలాంటి సభలు మనకు అవసరమా అని జగన్ ప్రశ్నించారు. శాసనమండలి రద్దు చేస్తున్నామని చెప్పేందుకు గర్వ పడుతున్నట్టుగా  జగన్ చెప్పారు.  సోమవారం నాడు  ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానంపై సీఎం జగన్ ప్రసంగించారు. 

Also read:రద్దుకే జగన్ నిర్ణయం: మండలి రద్దు, పునరుద్ధరణ చరిత్ర ఇదీ...

Latest Videos

undefined

ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా వద్దా అనేది మన ముందున్న ప్రశ్న అని జగన్ చెప్పారు. మండలి భవిష్యత్తుకు సంబంధించింది ఇదీ కాదన్నారు. శాసనమండలి అవసరమని భావిస్తే అన్ని రాష్ట్రాల్లో రెండో సభను కొనసాగించే అవకాశం ఉండేదని జగన్ చెప్పారు. 

Also read:శాసన మండలిపై చంద్రబాబు యూటర్న్ అసెంబ్లీలో వీడియోల ప్రదర్శన

దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే  శాసనమండలి ఉన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు.   అసోం, మద్యప్రదేశ్,పంజాబ్,పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు  శాసనమండళ్లను రద్దు చేసుకొన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. 

ఏపీ శాసనసభలోనే  పలువురు మేధావులు ఉన్నారని సీఎం జగన్ గుర్తు చేశారు. శాసనమండలి వల్ల పాలనలో జాప్యం, ప్రజా ధనం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందన్నారు. శాసనమండలిపై డబ్బు ఖర్చు చేయడం శుద్ద దండగ అని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రతి ఏటా శాసనమండలి కోసం రూ. 60 కోట్లు ఖర్చు చేస్తున్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఇంత డబ్బు శాసనమండలిపై ఖర్చు చేయడం అవసరం లేదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.  

Also read:జగన్ కోరిక తీరేనా: శాసన మండలి రద్దుకు కనీసం రెండేళ్లు

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అడ్డుకొనేందుకు  శాసనమండలి పనిచేస్తోందన్నారు. శాసనమండలి చేసిన అన్ని సవరణలను పాటించాల్సిన అవసరం అసెంబ్లీకి లేదని జగన్ గుర్తు చేశారు. ఈ కారణంగానే శాసనమండలి రద్దు వ్యవహరాన్ని అసెంబ్లీకే కట్టబెట్టినట్టుగా జగన్  చెప్పారు.
 

click me!