పవన్, చిరులకు వైఎస్ జగన్ ఆహ్వానం: కేవీపికి ఫోన్

Published : May 29, 2019, 12:12 PM IST
పవన్, చిరులకు వైఎస్ జగన్ ఆహ్వానం: కేవీపికి ఫోన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలువురు ప్రముఖులను స్వయంగా ఆహ్వానం పలుకుతున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలువురు ప్రముఖులను స్వయంగా ఆహ్వానం పలుకుతున్నారు. వారికి ఫోన్లు చేసి తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పిలుస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి జాతీయ, రాష్ట్ర నాయకులకు స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానం పలుకుతున్నారు. 

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలకు ఫోన్‌ చేసి తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆయన ఆహ్వానించారు. 

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను కూడా ఆహ్వానించారు. సినీ నటుడు చిరంజీవి, కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. 

మంగళవారం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి ఫోన్‌ చేసిన వైఎస్‌ జగన్‌ తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం 12.23 గంటల ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?