విజయవాడ పార్లమెంటుకు వైసీపీ తరపున శేషగిరిరావు

Published : Jul 24, 2017, 06:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
విజయవాడ పార్లమెంటుకు వైసీపీ తరపున శేషగిరిరావు

సారాంశం

తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో విజయవాడ పార్లమెంటుకు శేషగిరిరావు పోటీ చేస్తే బాగుంటుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు సమాచారం. అయితే, శేషగిరిరావు మాత్రం కాస్త ఊగిసలాటలో ఉన్నారని సమాచారం.

అలనాటి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తమ్ముడు, ఇప్పటి సూపర్ స్టార్ మహేష్ బాబు బాబాయ్ అయిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విజయవాడ నుండి వైసీపీ తరపున పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తారా? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో విజయవాడ పార్లమెంటుకు శేషగిరిరావు పోటీ చేస్తే బాగుంటుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు సమాచారం. విజయవాడ లోక్ సభ కు వైసీపీ తరపున వారు పోటీ చేస్తారు, వీరు పోటీ చేస్తారని ఇప్పటి వరకూ వినిపిచిన పేర్లన్నీ ఉత్త ప్రచారంగానే మిగిలిపోయాయి.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం విజయవాడ నుండి శేషగిరిరావు పోటీ చేయాలని జగన్ గట్టిగా కోరుతున్నారు. అయితే, శేషగిరిరావు మాత్రం కాస్త ఊగిసలాటలో ఉన్నారని సమాచారం. వయసు తదితరాల నేపధ్యంలో పోటీ చేయటానికి వెనకాడుతున్నట్లు తెలిసింది. అదే విషయాన్ని జగన్ తో కూడా చెప్పారట. ఎన్నికల్లో పార్టీ తరపున పనిచేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఓ పదవి తీసుకుంటాను అని చెప్పారట. అయితే, జగన్ మాత్రం అందుకు అంగీకరించలేదట. కాగా శేషగిరిరావుకు జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ తో కూడా బాగా సన్నిహితంగా ఉండేవారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ ఏదైనా కారణాంతరాల వల్ల శేషగిరిరావు గనుక వెనకాడితే ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పివిపి) అభ్యర్ధిగా ఉండవచ్చని సమాచారం.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu