బొత్సా డౌట్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ?

Published : Jul 24, 2017, 05:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
బొత్సా డౌట్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ?

సారాంశం

చంద్రబాబు పాలన చూస్తుంటే రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏమైనా అమలు చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందన్న తన అనుమానాన్ని వ్యక్తం చేసారు. ఆయనకు అంత అనుమానం ఎందుకు వచ్చిందంటే, రాష్ట్రంలో పోలీస్‌ పాలన నడుస్తోందట.

బొత్సా సత్యనారాయటనకు పెద్ద డౌటే వచ్చింది? రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పాలనలో ప్రజాస్వామ్యం ఉందా అని వైసీపీ నేత అడుగుతున్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు పాలన చూస్తుంటే రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏమైనా అమలు చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందన్న తన అనుమానాన్ని వ్యక్తం చేసారు. ఆయనకు అంత అనుమానం ఎందుకు వచ్చిందంటే, రాష్ట్రంలో పోలీస్‌ పాలన నడుస్తోందట. ముద్రగడ పాదయాత్రను అడ్డుకునేందుకు కాకినాడ నుంచి అమరావతి వరకూ వేలమంది పోలీసులు ఎందుకు మోహరించారని  ప్రభుత్వాన్ని నిలదీసారు.  

కాపు సామాజిక వర్గం మొత్తంపై బైండోవర్‌ కేసులు పెడతారా అంటూ చంద్రబాబుపూ మండిపడ్డారు. ముద్రగడ పద్మనాభం ఏమైనా దేశద్రోహానికి పాల్పడుతున్నారా? ఆయన ఏమైనా విద్రోహశక్తా?  అని బొత్స సూటిగా ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో వాతావరణం ప్రస్తుతం కర్ఫ్యూను తలపిస్తోందన్నారు. ముద్రగడను నిర్బంధిస్తే కాపుల్లోని ప్రతి ఒక్కరు ముద్రగడలా మారతారని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన హామీల అమలు కోసం ఎవరు పోరాడినా వైఎస్‌ఆర్‌ సీపీ మద్దతు ఇస్తుందని చెప్పటం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu