మీరిచ్చిన భరోసాతోనే రాష్ట్రం వైపు చూశా: కడపలో జగన్

By narsimha lodeFirst Published Jul 9, 2021, 3:59 PM IST
Highlights

రెండు రోజుల కడప జిల్లా టూర్ లో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల, కడపలలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 400 కోట్లతో కడపలో  అబివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లా ప్రజల రుణం తాను తీర్చుకోలేనని చెప్పారు. జిల్లాకు ఎంత అభివృద్ది చేసినా కూడ తక్కువేనని ఆయన చెప్పారు. 

కడప: వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత కడపను ఎవరూ పట్టించుకోలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.కడప పట్టణంలో  రూ. 400 కోట్లతో అభివృద్ది పనులకు సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కడపలో నిర్వహించిన సభలో  ప్రసంగించారు.

also read:బ్రహ్మంసాగర్ ఎప్పటికీ నిండుకుండలా ఉండేలా చూస్తా: బద్వేల్‌లో జగన్

2004 నుండి 2009 వరకు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప అభివృద్దిలో దూసుకుపోయిందన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత కడపను ఏ పాలకులు కూడ పట్టించుకోలేదన్నారు. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప అభివృద్దిలో దూసుకుపోతోందన్నారు. గొప్ప నగరాల జాబితాలో కడప త్వరలోనే చేరనుందని ఆయన చెప్పారు.కడప జిల్లాకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని ఆయన చెప్పారు.

కడప జిల్లాకు ఎంత చేసినా కూడ తక్కువేనని ఆయన చెప్పారు.  ఎంత చేసినా కూడ ఈ జిల్లా రుణం నేను తీర్చుకోలేనన్నారు. ఈ జిల్లా ప్రజలు ఎప్పుడూ కూడ తనను గుండెల్లో పెట్టుకొన్నారన్నారు..మీరిచ్చిన భరోసాతోనే తాను రాష్ట్రం వైపు చూశానని ఆయన  చెప్పారు.


 

click me!