60 శాతం ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సిన్: ఆగష్టు 16 నుండి స్కూల్స్ రీఓపెన్ హైకోర్టులో ఏపీ సర్కార్

By narsimha lode  |  First Published Jul 9, 2021, 2:40 PM IST

విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించే విషయమై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  ఇప్పటికే ప్రభుత్వ స్కూల్ టీచర్లకు వ్యాక్సిన్ వేయిస్తోంది. 60 శాతం టీచర్లు వ్యాక్సిన్ వేయించుకొన్నారు. ఆగష్టు 16 నాటికి స్కూల్స్ ప్రారంభించనుంది జగన్ సర్కార్.. ఆ సమయానికి టీచర్లంతా వ్యాక్సిన్ వేయించుకొనేలా ప్లాన్ చేస్తోంది.ఈ విషయాన్ని ఇవాళ హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. 



అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఈ ఏడాది ఆగష్టు 16 నుండి స్కూల్స్ తెరుస్తామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో స్కూల్స్  రీ ఓపెన్ చేయడంపై  హైకోర్టులో విచారణ జరిగింది.ప్రభుత్వ స్కూల్స్ లో పనిచేస్తున్న  టీచర్లలో సుమారు 60 శాతం మందికి  వ్యాక్సిన్ అందించినట్టుగా ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

also read:ఆగస్ట్ 16నుండి రాష్ట్రంలో స్కూల్ రీఓపెన్: ఏపి విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన

Latest Videos

మిగతావారికి కూడ వ్యాక్సిన్ ను వేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది హైకోర్టు.  ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను  ఈ ఏడాది ఆగష్టు 11 వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

రాష్ట్రంలో  కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు ఇంకా తెరుచుకోలేదు. ఈ విషయమై ప్రభభుత్వం కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడ ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.  ఈ నెల 31వ తేదీలోపుగా విద్యార్థులకు పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.


 

click me!