జనవరి 1 నుంచి ఇంటింటికి రేషన్: పక్కా ఏర్పాట్లు

By Siva KodatiFirst Published Dec 20, 2020, 5:14 PM IST
Highlights

జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. నాణ్యమైన బియ్యం సహా నిత్యావసరాలను ఇంటి వద్దే ఇవ్వబోతోంది. ఇందుకోసం 9 వేల వాహనాలను సిద్ధం చేసింది సర్కార్

జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. నాణ్యమైన బియ్యం సహా నిత్యావసరాలను ఇంటి వద్దే ఇవ్వబోతోంది. ఇందుకోసం 9 వేల వాహనాలను సిద్ధం చేసింది సర్కార్.

టాటా, సుజుకీ సంస్థల ద్వారా డోర్ డెలీవరి ట్రక్కులను కొనుగోలు చేసింది. డెలీవరి ట్రక్కులోనే కాటా పెట్టి ఇళ్ల వద్దే రేషన్ పంపిణీ చేస్తారు. ట్రక్కులో ఒక ఫ్యాన్, ఫైర్ ఎక్సటింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో  ఉంచనున్నారు.

ఎనౌన్సమెంట్ కోసం మైక్ సిస్టం కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం.  సబ్సిడీ ద్వారా డోర్ డెలివరీ వాహానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించినట్టు చెబుతున్నారు. ఇక కొన్ని చోట్ల అద్దె ప్రాతిపదికన కూడా వీటిని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

click me!