చదలవాడ కటుంబంలో ఆస్తి వివాదం: ట్రస్ట్ నుండి రెండో భార్య సుచరిత తొలగింపు

By narsimha lodeFirst Published Dec 20, 2020, 4:29 PM IST
Highlights

టీటీడీ మాజీ ఛైర్మెన్ చదలవాడ కృష్ణమూర్తి కుటుంబంలో ఆస్తివివాదం చోటు చేసుకొంది. రెండో బార్య సుచరితపై టీటీడీ మాజీ ఛైర్మెన్ చదలవాడ కృష్ణమూర్తి కేసు పెట్టారు.
 


తిరుపతి: టీటీడీ మాజీ ఛైర్మెన్ చదలవాడ కృష్ణమూర్తి కుటుంబంలో ఆస్తివివాదం చోటు చేసుకొంది. రెండో బార్య సుచరితపై టీటీడీ మాజీ ఛైర్మెన్ చదలవాడ కృష్ణమూర్తి కేసు పెట్టారు.తమ ట్రస్టు నుండి సుచరితను తొలగించామని చదలవాడ కృష్ణమూర్తి ప్రకటించారు. ఈ ట్రస్టుతో సుచరితకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రకటించారు. 

తన  భర్తను బెదిరించి ఇలా మాట్లాడిస్తున్నారని సుచరిత ఆరోపించారు. తనపై కుట్ర జరుగుతోందన్నారు.  కొంతకాలంగా తన భర్తతో పాటు ఆయన బందువులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ ఛైర్మెన్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన స్థానంలో పుట్టా సుధాకర్ యాదవ్ ను చంద్రబాబునాయుడు సర్కార్ నియమించింది.తిరుపతి నుండి ఆయనకు టీడీపీ సీటు దక్కకపోవడంతో ఆయన తెలుగు దేశం పార్టీని వీడారు.2014లో తిరుపతి టికెట్టు ఆయనకు ఇవ్వని కారణంగానే ఆయనకు టీటీడీ ఛైర్మెన్ పదవిని చంద్రబాబునాయుడు కట్టబెట్టారని అప్పట్లో టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. 

click me!