దారుణం: భార్యను స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్‌ చేసిన భర్త

Siva Kodati |  
Published : Dec 20, 2020, 04:19 PM IST
దారుణం: భార్యను స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్‌ చేసిన భర్త

సారాంశం

గుంటూరులో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై భర్త, తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఏటీ అగ్రహారానికి చెందిన షేక్‌ మీరావలి అలియాస్‌ బాబుకు అదే ప్రాంతానికి చెందిన మహిళతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. 

గుంటూరులో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై భర్త, తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఏటీ అగ్రహారానికి చెందిన షేక్‌ మీరావలి అలియాస్‌ బాబుకు అదే ప్రాంతానికి చెందిన మహిళతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం.

సాఫీగా సాగిపోతున్న వీరి కాపురంలో మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఈ నెల 17న భార్య బంధువులు, బాబు మధ్య వివాదం జరిగింది.

దీనిపై బాబు నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే దానికి వివాదాలు ఎందుకని, ఇకపై కలిసే ఉందామని అడిగేందుకు భార్య.. భర్త ఇంటికి వెళ్లింది.

ఆ సమయంలో భర్త బాబు, అతని స్నేహితులు రబ్బాని, సలీంలు కలిసి మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో బాధితురాలిపై బాబు, అతని స్నేహితులు రబ్బాని, సలీం కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు.

అనంతరం రోడ్డు మీద పడేశారు. కొద్దిసేపటికి రహదారిపై పడివున్న ఆమెను బంధువులు, స్థానికులు ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?