ఏపీలో జాతీయ విద్యా విధానం: జగన్ అంగీకారం.. అధికారుల కసరత్తు

By Siva KodatiFirst Published Sep 15, 2020, 6:42 PM IST
Highlights

జాతీయ విద్యా విధానం 2020కి కసరత్తు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. దీనిపై మంగళవారం క్యాంప్ ఆఫీసులో సమీక్ష చేపట్టిన సీఎం జగన్ 5+3+3+4 విధానం అమలుకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు.

జాతీయ విద్యా విధానం 2020కి కసరత్తు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. దీనిపై మంగళవారం క్యాంప్ ఆఫీసులో సమీక్ష చేపట్టిన సీఎం జగన్ 5+3+3+4 విధానం అమలుకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన విద్యా విధానం అమలు చేయనుంది.

ఇందుకు తగిన విధంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, ఉపాధ్యయులకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలని జగన్ అధికారులను ఆదేశించారు. విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి తగిన విధంగా బదిలీలు ఉండాలని ఆయన చెప్పారు. ఉపాధ్యాయుల ‘‘ రీ అపోర్షన్‌మెంట్‌’’కు ముఖ్యమంత్రి ఆదేశించారు. 

Also Read:భార‌త‌దేశ విద్యావిధానం 2020లో కొత్త మార్పులు..!

కాగా 34 సంవత్సరాల విరామం తరువాత జూలై 29న కేంద్ర జాతీయ మంత్రివర్గం కొత్త జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించింది. భార‌త‌దేశ విద్యావ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ముంద‌డుగు వేసింది.

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలో స‌మావేశ‌మైన కేంద్ర క్యాబినెట్.. ఇస్రో మాజీ చీఫ్ కే క‌స్తూరీరంగ‌న్ క‌మిటీ సిఫార‌సు మేరకు జాతీయ నూత‌న విద్యా విధానానికి ఆమోదం తెలిపింది.

క‌స్తూరీరంగ‌న్ క‌మిటీ సిఫార‌సు మేర‌కే కేంద్ర‌ మాన‌వ‌వ‌న‌రుల అభివృద్ధి శాఖ‌ను విద్యాశాఖ‌గా మారుస్తూ మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. కేబినెట్ ఆమోదించిన కొత్త ఎన్‌ఇపిని పార్లమెంటులో సమర్పించలేదు.

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రూపొందించిన 21 వ శతాబ్దంలో ఇది మొదటిది. ఇది ఒక విధానం మాత్రమే చట్టం కాదు విద్య ఏకకాలంలో ఉన్నందున దాని ప్రతిపాదనలు రాష్ట్రాల అమలు, కేంద్రం రెండింటిపై ఆధారపడి ఉంటుంది.

click me!