ఏపీలోనూ గొర్రెలు, మేకల పంపిణీ: ముహూర్తం ఎప్పుడంటే..?

Siva Kodati |  
Published : Nov 29, 2020, 09:12 PM IST
ఏపీలోనూ గొర్రెలు, మేకల పంపిణీ: ముహూర్తం ఎప్పుడంటే..?

సారాంశం

డిసెంబరు 10న గొర్రెలు, మేకలు పంపిణీ చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ఆర్ చేయూత, ఆసరా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది

డిసెంబరు 10న గొర్రెలు, మేకలు పంపిణీ చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ఆర్ చేయూత, ఆసరా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

2.49 లక్షల యూనిట్ల పంపిణీకి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. దీనిలో భాగంగా పంపిణీకి చర్యలు తీసుకోవాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది.

అలాగే అనంతపురం జిల్లా పెనుకొండలో షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2.5 కోట్లతో గొర్రెల కాపరుల శిక్షణా కేంద్రం ఏర్పాటుకు అనుమతించింది.

ప్రస్తుత గొర్రెల పెంపకం కేంద్రంలోనే శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించింది.  గొర్రెల పెంపకంపై శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రం దోహదం చేస్తుందని సర్కార్ అభిప్రాయపడింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం