పేర్ని నానిపై దాడి: విచారణకు ఆదేశించిన హోంమంత్రి

Siva Kodati |  
Published : Nov 29, 2020, 08:07 PM IST
పేర్ని నానిపై దాడి: విచారణకు ఆదేశించిన హోంమంత్రి

సారాంశం

మంత్రి పేర్నినానిపై హత్యాయత్నాన్ని ఖండించారు హోంమంత్రి మేకతోటి సుచరిత. నాని తల్లి దశదిన కర్మ లో భాగంగా ఆమె ఆదివారం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు

మంత్రి పేర్నినానిపై హత్యాయత్నాన్ని ఖండించారు హోంమంత్రి మేకతోటి సుచరిత. నాని తల్లి దశదిన కర్మ లో భాగంగా ఆమె ఆదివారం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా దాడి ఘటనపై పేర్ని నానిని, పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి. అసలు నిందితులు ఎవరో వెంటనే తేల్చాలని పోలీసులను సుచరిత ఆదేశించారు.

Also Read:ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఘటన సంచలనం సృష్టిస్తోంది. నాగేశ్వరరావు అనే తాపీమేస్త్రీ తాపీతో మంత్రిపై దాడికి యత్నించాడు. అయితే మంత్రి అనుచరులు వెంటనే అప్రమత్తం అయి అడ్డుకోవడంతో మంత్రి క్షేమంగా బయటపడ్డారు.

అతను ఎందుకిలా చేశాడో నాకు తెలీదు. నేనైతే సురక్షితంగా ఉన్నా. అతను బలరాం పేటకు సంబంధించిన వ్యక్తి అని స్వయంగా మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి