ఏపీలో కేసులు ఎత్తివేసిన జగన్ సర్కార్

Published : Dec 17, 2019, 04:29 PM ISTUpdated : Dec 17, 2019, 04:34 PM IST
ఏపీలో కేసులు ఎత్తివేసిన జగన్ సర్కార్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ఆందోళనల సమయంలో నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ఉద్యమాల్లో పెట్టిన కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.  ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నమోదైన కేసులను ఎత్తివేస్తూ సర్ాకర్ నిర్ణయం తీసుకొంది.

Also read:పనికిమాలిన కబుర్లు కాకుండా పనికొచ్చేవి చెప్పు: చంద్రబాబుపై కొడాలి నాని

2016 జనవరి లో తునిలో  కాపుల సభ సందర్భంగా చోటు చేసుకొన్న హింసాకాండపై నమోదైన కేసులను ప్రభుత్వం  ఎత్తివేసింది. భోగాపురం విమానాశ్రయం భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో చోటు చేసుకొన్న కేసులను కూడ ఎత్తేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రిలయన్స్ ఆస్తుల ధ్వంసం కేసులో అనంతపురం, గుంటూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడ నమోదైన కేసులను కూడ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?