పనికిమాలిన కబుర్లు కాకుండా పనికొచ్చేవి చెప్పు: చంద్రబాబుపై కొడాలి నాని

By Nagaraju penumala  |  First Published Dec 17, 2019, 4:20 PM IST

ఒకవేళ పీవీ నర్సింహారావు ఎక్స్ ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లకు చంద్రబాబు నాయుడే శంకుస్థాపన చేసినట్లు నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమా అన్నారు. 


అమరావతి: తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబు నాయుడు ఒక అబద్దాన్ని పదేపదే చెప్తే నిజమైపోతుందని అనుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు. 

హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నర్సింహారావు హైవే వంటి బృహత్తర కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి పూర్తి చేశారా అంటూ కొడాలి నాని నిలదీశారు. 

Latest Videos

undefined

పూర్తి చేయాల్సిన అవసరం లేదని కనీసం శంఖుస్థాపన చేశారా అంటూ నిలదీశారు మంత్రి కొడాలి నాని. అబద్దాన్ని పదేపదే చెప్తే నిజమైపోతుందని చంద్రబాబు ఫీలవుతుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాజమౌళీ, బోయపాటిలు సలహాదారులా.. ఏంటి బాబూ ఇది: ధర్మాన...

ఒకవేళ పీవీ నర్సింహారావు ఎక్స్ ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లకు చంద్రబాబు నాయుడే శంకుస్థాపన చేసినట్లు నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమా అన్నారు. చంద్రబాబు ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. 

నిండు సభలో పచ్చి అబద్ధాలు చెప్తున్నారంటూ మండిపడ్డారు కొడాలి నాని. బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా, ముంబై, చెన్నై ఢిల్లీ అంటూ ఉంటారని అవన్నీ చంద్రబాబు నాయుడు పుట్టకముందు నుంచే మహానగరాలని చెప్పుకొచ్చారు. 

పోనీ చంద్రబాబు మహానగరాన్నే నిర్మిస్తే హైదరాబాద్ తప్ప ఇంకో మహానగరాన్ని ఎందుకు నిర్మించలేదో చెప్పాలని నిలదీశారు కొడాలి నాని. రూ.2లక్షల కోట్లు ఆదాయం వస్తే ఏడాదికి వచ్చే 50వేల కోట్ల రూపాయలతో రాజధానిని అభివృద్ధి చేయవచ్చునని ఇలా ఏవో పనికి మాలిన మాటలు చెప్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

చంద్రబాబు నాయుడు అతిగా మాట్లాడతారని ఆయనకు తక్కువ అవకాశం ఇచ్చి తమకు విముక్తి కల్పించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు సూచించారు మంత్రి కొడాలి నాని. కొడాలి నాని వ్యాఖ్యలతో వైసీపీ ఎమ్మెల్యేలు పడిపడీ నవ్వారు. 

ap assembly: ఎన్ని ఏళ్లైనా ఆ నగర అభివృద్థిలో నా ప్రాంత ఉంటుంది:చంద్రబాబు...
 

click me!