అమరావతి అనేది ఒక చరిత్ర అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అందర్నీ సంప్రదించిన తర్వాతే రాజధానిని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు అనుకూలంగా ఉండేలా అమరావతిని నిర్మించిననున్నట్లు తెలిపారు.
అమరావతి: నవ్యాంధ్ర రాజధానిపై మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం అమరావతిలో రాజధానిని నిర్మించానని మాట్లాడటం సరికాదన్నారు.
తెలంగాణ ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ ఉద్యమం, ఆ తర్వాత మళ్లీ తెలంగాణ ఉద్యమం, ఈ మూడు ఉద్యమాలను సమదృష్టితో చూడాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. రాజధాని అనేది ఒక రాష్ట్రానికి తలవంటిది అని చెప్పుకొచ్చారు.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా మెుండం ఉంటే ఏం లాభం అని నిలదీశారు చంద్రబాబు. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ లాంటి రాజధానిని వదులు కోవడం ఇష్టం లేక అభివృద్ధిని కోల్పోతున్నామనే భావన ప్రతీ ఒక్కరిలో నెలకొందని చెప్పుకొచ్చారు చంద్రబాబు.
అమరావతి ప్రజారాజధాని అని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క వర్గానికో సామాజిక వర్గానికో చెందినది కాదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అన్ని హంగులతో అమరావతి రాజధానిగా ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చారు.
ప్రజల కోసం నిర్మించిన రాజధాని అమరావతి కాబట్టి అమరావతి అని పెట్టినట్లు తెలిపారు. శాలివాహనులు పాలించిన ప్రాంతం అమరావతి అని చెప్పుకొచ్చారు. కోహినూర్ వజ్రం వచ్చింది కృష్ణాగుంటూరు జిల్లాలలోనే దొరికిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అమరావతి అనేది ఒక చరిత్ర అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అందర్నీ సంప్రదించిన తర్వాతే రాజధానిని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు అనుకూలంగా ఉండేలా అమరావతిని నిర్మించిననున్నట్లు తెలిపారు.
డ్రీమ్ క్యాపిటల్ గా అమరావతి ఉండాలన్నదే తాను రూపొందించినట్లు చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. భావితరాలకు ఆశగా ఉండేలా రాజధానిని నిర్మించినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాలకు వలసవెళ్లే పరిస్థితి లేకుండా అమరావతి వస్తే భవిష్యత్ ఉంటుందన్న ఆలోచనలతో రాజధానిని నిర్మించినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అలాగే రాజధానిలో సంపద సృష్టించాలనే ఆలోచనతో కూడా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా రాజధాని ఉండాలన్నదే తన తపన అని చెప్పుకొచ్చారు. సంపద సృష్టి వల్లే ఆదాయం వస్తుందని ఆ ఆదాయం వల్ల పేదరికం పోతుందన్నది వాస్తవమన్నారు చంద్రబాబు.
రాజమౌళీ, బోయపాటిలు సలహాదారులా.. ఏంటి బాబూ ఇది: ధర్మాన..