వైసీపీ పాలనకు మూడేళ్లు... జగన్ స్పెషల్ ట్వీట్...!

By telugu news team  |  First Published May 30, 2022, 11:44 AM IST

రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న న‌మ్మకాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్లలో 95 శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేసినట్లు తెలిపారు. 


ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనకు మూడేళ్లు పూర్తయ్యాయి. మూడేళ్ల క్రితం 151 సీట్ల తో వైసీపీ అఖండ విజయం సాధించి... జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా... నేటితో జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి.. మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో...  సీఎం జగన్.. ఎమోషనల్ ట్వీట్ చేశారు.

రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న న‌మ్మకాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్లలో 95 శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింతగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

Latest Videos

 

రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మ‌రొక్క‌సారి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా. 2/2

— YS Jagan Mohan Reddy (@ysjagan)

‘‘మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్యమంత్రిగా బాధ్యత‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న న‌మ్మకాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్లలో 95 శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మ‌రొక్క‌సారి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా.’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
 

click me!