తెలుగుదేశం పార్టీని నేను ఎప్పుడూ తిట్టలేదు.. అది గొప్ప పార్టీ : వైసీపీ నేత వల్లభనేని వంశీ...

Published : May 30, 2022, 07:53 AM IST
తెలుగుదేశం పార్టీని నేను ఎప్పుడూ తిట్టలేదు.. అది గొప్ప పార్టీ : వైసీపీ నేత వల్లభనేని వంశీ...

సారాంశం

వైసీపీ నేత వల్లభనేని వంశీ టీడీపీ గురించి చేసిన వ్యాఖ్యలు చర్ఛనీయాంశంగా మారాయి. తెలుగుదేశం పార్టీ గొప్పదని.. పార్టీని తానెప్పుడూ తిట్టలేదని అన్నారు.  

గన్నవరం : Telugudesam Partyగొప్ప పార్టీ అని.. తాను ఎప్పుడూ పార్టీని తిట్టలేదని.. కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే Vallabhaneni Vamsi అన్నారు. Nara Lokesh చేతుల్లోకి వచ్చిన తర్వాత పార్టీ విధానాలు దెబ్బతిన్నాయని మాత్రమే విమర్శలు చేశానని స్పష్టం చేశారు. హనుమాన్ జంక్షన్ లో జేపీఎల్ క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఆయన గన్నవరం వైసీపీ నేత దుట్ట రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పార్టీలో కొందరు వ్యక్తులు తన మీద ఆరోపణలు చేస్తున్నారని తనతో కలిసి పని చేసే వాళ్ళని కలుపుకొని పోతానని స్పష్టం చేశారు. 

తన స్థాయి కానివారు కూడా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వార్డు మెంబర్ గా గెలవని వ్యక్తులు కూడా విమర్శలు చేయడం సరికాదని హెచ్చరించారు. మట్టి అమ్ముకునే కర్మ తనకు పట్టలేదని తేల్చిచెప్పారు. అక్రమ మట్టి తవ్వకాలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు. 

కాగా మే 20న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి పని చేయలేమని వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు వర్గం తేల్చిచెప్పింది.  మే 19 నాడు రాత్రి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రత్యర్థి వర్గం దుట్టా రామచంద్రారావు, ఆయన అల్లుడు వైసీపీ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ శివభారత రెడ్డీలతో సీఎంవో అధికారులు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు  చర్చించారు. సీఎంవో సెక్రెటరీ కే ధనంజయ రెడ్డి మే 19న దుట్ట రామచంద్రరావు శివ భరత్ రెడ్డిలతో మాట్లాడారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో తమకున్న సమస్యలను సీఎంవో సెక్రెటరీ ధనుంజయ రెడ్డితో పాటు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వివరించారు. 

నియోజకవర్గంలో అక్రమంగా క్వారీల నిర్వహణ, మట్టి అమ్మకాలు చేస్తున్నారని వంశీపై తయారు చేసిన నివేదికను దుట్టా రామచంద్రరావు సీఎం అధికారులకు అందించారని సమాచారం. వంశీతో కలిసి పనిచేయలేమని కూడా స్పష్టం చేశారని తెలిసింది. వంశీ నుంచి వివరణ తీసుకున్న తర్వాత మళ్లీ మాట్లాడతామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని సమాచారం. వీరిద్దరితో భేటీ ముగిసిన తర్వాత ధర్మవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడారు. అయితే ఎమ్మెల్యే వంశీ తో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.

సజ్జల రామకృష్ణారెడ్డికి మరో కార్యక్రమం ఉన్నందున మే 21నాడు కలవాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం ఈ సమావేశం ముగిసిన తర్వాత దుట్టా రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ తో కలిసి పని చేయబోనని స్పష్టం చేశారు. వైయస్ కుటుంబానికి సాయం చేయడం తమకు తెలుసునని చెప్పారు. అవమానాలు భరించి మరొకరి వెంట తిరగాల్సిన అవసరం తమకు లేదన్నారు. వైసిపి కేడర్ ను వంశి తొక్కేస్తున్నారని కూడా దుట్టా ఆరోపించారు. ఈ కారణంగానే తాను రాజకీయాల్లో యాక్టివ్గా లేనని కూడా తెలిపారు. వల్లభనేని వంశీకీకి, దుట్టా రామచంద్రారావు వర్గానికి మధ్య కొంతకాలంగా గ్యాప్ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఈ గ్యాప్ మరింత పెరిగింది. దీంతో ఇరు వర్గాలను సీఎంఓకు పిలిపించారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?