ఊరట: చీప్ విప్ గా శ్రీకాంత్ రెడ్డి, విప్‌లుగా చెవిరెడ్డి, పార్ధసారథి

By narsimha lodeFirst Published Jun 8, 2019, 9:49 AM IST
Highlights

న విధేయుడిగా ముద్రపడిన కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి  ఏపీ సీఎం వైెస్ జగన్  చీప్ విప్ పదవిని కట్టబెట్టారు.
 

అమరావతి: తన విధేయుడిగా ముద్రపడిన కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి  ఏపీ సీఎం వైెస్ జగన్  చీప్ విప్ పదవిని కట్టబెట్టారు.మంత్రి పదవిని ఇవ్వని కారణంగా  పార్టీ ఆవిర్భావం నుండి తన వెంట నడిచినందుకు శ్రీకాంత్ రెడ్డికి చీప్ విప్ పదవిని కట్టబెట్టారు.

జగన్ మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి నలుగురికి మాత్రమే పదవులు ఇచ్చారు. మంత్రి పదవులు దక్కని వారికి విప్‌లుగా పార్ధసారథి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజా, బూడిద ముత్యాలనాయుడు, కొరుముట్ల శ్రీనివాసులును నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకొన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీలు, కాపు సామాజిక వర్గాలకు జగన్ తన మంత్రివర్గంలో పెద్ద పీట వేశారు. సామాజిక వర్గాల వారీగా కూడ సమతుల్యత పాటించే ప్రయత్నం చేశారు. మంత్రి పదవులు దక్కని వారికి చీప్ విప్ , విప్‌లుగా నియమించారు.

 

 

సంబంధిత వార్తలు

గడికోట శ్రీకాంత్ రెడ్డికి చీప్ విప్ పదవి: సచివాలయానికి జగన్ (లైవ్ అప్‌డేట్స్)

జగన్ వైపు: ఆరేళ్ల క్రితం ఇదే రోజు అనర్హత, నేడు మంత్రులు

click me!