వివేకాది వైఎస్ ఇంటి మార్క్ మ‌ర్డ‌ర్...: అయ్యన్నపాత్రుడు సంచలనం

By Arun Kumar P  |  First Published Apr 14, 2021, 2:02 PM IST

వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని నారా లోకేష్ తిరుపతి వెంకన్న పాదాలపై ప్రమాణం చేసిన నేపథ్యంలో సీఎం జగన్ పై అయ్యన్న తీవ్ర ఆరోపణలు చేశారు.  
 


తిరుపతి: ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి దారుణ హత్య వైఎస్ ఇంటి మార్క్ మ‌ర్డ‌ర్ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని నారా లోకేష్ తిరుపతి వెంకన్న పాదాలపై ప్రమాణం చేసిన నేపథ్యంలో సీఎం జగన్ పై అయ్యన్న తీవ్ర ఆరోపణలు చేశారు.  

''వివేకా హ‌త్య‌పై ఉద‌యం గుండెపోటు అని సాయంత్రం గొడ్డ‌లి వేటు అన్న‌ప్పుడే ఇది వైఎస్ ఇంటి మార్క్ మ‌ర్డ‌ర్ అని అందరికీ అర్థ‌మైంది. ఇంక తెలియాల్సింది సీబీఐకి మాత్ర‌మే. నారా లోకేష్ స‌వాల్ విసిరితే పారిపోయిన వైఎస్ జగన్ ఇప్ప‌టికైనా మించిపోయింది లేదు. బాబాయ్ హ‌త్య‌కేసు విచార‌ణ‌లో సీబీఐకి స‌హ‌క‌రించు. బాబాయ్ ఆత్మ‌యినా శాంతిస్తుంది'' అని అయ్యన్న సూచించారు. 

Latest Videos

undefined

''14న తిరుపతి వచ్చి ఉంటే బాబాయ్ హత్య మిస్టరీ తేలిపోయేది. అందుకే వైఎస్ జగన్ గారు పర్యటన రద్దు చేసుకున్నారు. వెంకన్న సాక్షిగా ప్రమాణం అనగానే పరార్. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బాబాయ్ ని ఎవరు చంపారో తెలుసుకోవాలని అనుకుంటున్నారు'' అని పేర్కొన్నారు. 

read more   లోకేష్ వస్తే... కొంప‌లో పిల్లిలా న‌క్కి దాక్కున్నావేం జ‌గ‌న్‌రెడ్డి...: అచ్చెన్న ఆగ్రహం
 
''వివేకా గారి హత్యతో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదు 14 న వెంకన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధం అని లోకేష్ ఛాలెంజ్ విసరగానే పులివెందుల పిల్లి తోకముడిచింది. పేరాసిట్మాల్ బ్యాచ్ కరోనా అనగానే విషయం అందరికీ అర్థమైపోయింది'' అంటూ గతంలోనూ లోకేష్ ఛాలెంజ్ పై అయ్యన్న స్పందించారు. 
 
''మౌనం అర్దాంగీకారం. బాబాయ్ ని వేసేసింది అబ్బాయే అనడానికి ఇంతకన్నా ఆధారం ఏమి కావాలి? మా లోకేష్ సవాల్ విసిరాడు. 14 తేదీన వెంకన్న సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి సిద్దామా అని. బాబాయ్ హత్యతో సంబంధం లేకపోతే పులివెందుల పిల్లి మియాం అని ఎందుకు పారిపోయింది?'' అని ప్రశ్నించారు. 

''వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య గురించి లోక‌మంతా #whokilledbabai అని ప్ర‌శ్నిస్తోంది. అబ్బాయి మాత్రం నోరు విప్ప‌డంలేదు. అక్క సునీత ‌త‌న‌ తండ్రిని చంపిన హంత‌కుల్ని ప‌ట్టుకోమంటోంది. ప‌ట్టుకోగ‌ల‌వా? ఆ గొడ్డ‌లివేటు మీ ఇంటి రూటు చూపిస్తుంద‌ని భ‌య‌మా?'' అంటూ వరుస ట్వీట్లతో సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి అయ్యన్న. 
 

click me!