టిడిపి ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సోషల్ మీడియా వేదికన సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.
తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ పై అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. ఆయనను చంపింది మీరంటే మీరని ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మాజీ మంత్రి నారా లోకేష్ ఈ హత్యతో తనకుఎలాంటి సంబంధం లేదని అలిపిరి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేశారు. దీనిపై టిడిపి ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.
''బాబాయ్ హత్యతో తనకుగానీ,తన కుటుంబానికి గానీ సంబంధంలేదని నారా లోకేష్ తిరుపతిలో ప్రమాణం చేశాడు. మీకుగానీ,మీ కుటుంబసభ్యులకు గానీ ఈ హత్యతో సంబంధంలేదని ప్రమాణం చేయకుండా తాడేపల్లి కొంపలో పిల్లిలా నక్కి దాక్కున్నావేం జగన్‌రెడ్డి?'' అంటూ ట్విట్టర్ వేదికన అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
undefined
read more వైఎస్ వివేకానందరెడ్డి హత్య: అలిపిరి వద్ద లోకేష్ ప్రమాణం
''తండ్రి శవం తందూరీ అయిపోతే అక్కడే సీఎం పదవికోసం సంతకాలు సేకరించావు. బాబాయ్ బాత్రూమ్‌లో రక్తపు మడుగులో పడి వుంటే, ఓట్లు దండుకోవడానికి చూశావు. లోకేష్ సవాల్ విసిరితే పారిపోయి, హత్య మీ పనేనని ఒప్పుకున్నావు'' అని విమర్శించారు.
''ఢిల్లీని ఢీకొడతానని పులి ఎలివేషన్లు ఇచ్చే పెద్ద పిల్లిగారూ! బాబాయ్‌ని బాత్రూమ్ పెట్టి గొడ్డలి పోటు పొడిచింది మీరు గానీ, మీ కుటుంబసభ్యులు కాకపోతే ..లోకేష్ సవాల్‌ని ఎందుకు స్వీకరించలేదు. మీ మౌనం అంగీకారమని భావించాల్సి వస్తుంది'' అన్నారు.
''పులివెందుల రాజన్నకోట రహస్యం ప్రపంచానికి తెలియాలి. బాత్రూమ్‌లో బాబాయ్‌పై పడిన గొడ్డలి పోటుకి సమాధానం చెప్పాల్సింది అబ్బాయే. నాడు సీబీఐ విచారణ కోరిన జగన్‌రెడ్డి నేడు సీబీఐ విచారణ అంటేనే ఎందుకు ఉలికి పడుతున్నాడు? పుత్రప్రేమ పొరలు కమ్మేయడం వల్ల విజయమ్మ రక్తపుమరకలు తుడిచే లేఖలు రాస్తోంది. మీ షర్మిలాంటి బిడ్డే కదమ్మా సునీత. ఆమెకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా? మీ మరిది హత్యతో మీ కుటుంబంలో ఏ ఒక్కరికీ సంబంధంలేదని బైబిల్ సాక్షిగా చెప్పగలవా?'' అంటూ సీఎం జగన్ తల్లిని కూడా అచ్చెన్న ప్రశ్నించారు.