వైఎస్ భాస్కర్ రెడ్డికి నిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి.. తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలింపు..

By Sumanth KanukulaFirst Published May 27, 2023, 3:41 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఈరోజు నిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో సంగతి తెలిసిందే. అయితే భాస్కర్ రెడ్డి శుక్రవారం అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైఎస్ భాస్కర్ రెడ్డికి బీపీ తగ్గడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే వైఎస్ భాస్కర్ రెడ్డికి ప్రత్యేక చికిత్స అవసరమని ఉస్మానియా ఆస్పత్రి వైద్య సిబ్బంది గుర్తించి నిమ్స్‌కు తరలించాలని సూచించారు. 

Also Read: వివేకా హత్య కేసు.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. అప్పటివరకు చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు..

ఈ నేపథ్యంలోనే భాస్కర్ రెడ్డిని  కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈరోజు నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వార్డులో భాస్కర్‌రెడ్డికి ఈసీజీ, 2డీ ఎకో టెస్టులు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం భాస్కర్‌రెడ్డిని చంచల్ గూడ జైలుకి తరలించారు. ఇక, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు 2023న ఏప్రిల్ 16న వైఎస్ భాస్కర్ రెడ్డిని పులివెందులలోని ఆయన నివాసంలో అరెస్టు చేసింది. ఆ తర్వాత కోర్టు అనుమతితో ఆరు రోజుల పాటు విచారించారు. 

click me!