వివేకా కేసు.. ముగిసిన వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ, నాలుగు గంటల పాటు ప్రశ్నల వర్షం

Siva Kodati |  
Published : Mar 14, 2023, 04:04 PM IST
వివేకా కేసు.. ముగిసిన వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ, నాలుగు గంటల పాటు ప్రశ్నల వర్షం

సారాంశం

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.   

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. న్యాయవాది నాగార్జున సమక్షంలో ఆయనను సీబీఐ అధికారులు దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అధికారులు మూడు సార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సంగతి  తెలిసిందే. అయితే అవినాష్ మాత్రం ఈ కేసులో విచారణ సరైన మార్గంలో జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని.. తనపై తప్పుడు జరుగుతుందని అవినాష్ రెడ్డి చెబుతున్నారు. 

మరోవైపు ఈ కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి  తెలిసిందే. అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని సీబీఐని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను న్యాయమూర్తి పొడిగించారు. అదే సమయంలో తన పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు విచారించకుండా అడ్డుకోవాలన్న ఆయన అభ్యర్థననూ తోసిపుచ్చింది. 

ఇక, అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తనను కూడా ఇంప్లీడ్ చేయాలని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి కోర్టును కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు.. అవినాష్ రెడ్డి, సీబీఐ, సునీతా రెడ్డి తరఫు వాదనలపై విచారణ జరిపింది. సీబీఐ అవినాష్ రెడ్డిని ప్రధాన కుట్రదారుగా చూపించే ప్రయత్నం చేస్తోందని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. వివేకానంద రెడ్డి 2010లో ముస్లిం మహిళను వివాహం చేసుకున్నారని, వారికి ఒక కుమారుడు ఉన్నారని ఆయన వాదనలు వినిపించారు. . అతని రెండవ వివాహం ఫలితంగా, అతని కుటుంబానికి ఆర్థిక లావాదేవీలతో సహా విభేదాలు వచ్చాయని అన్నారు. కుటుంబంతో ఆస్తి తగాదాల కారణంగానే వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారని సీనియర్ న్యాయవాది వాదించారు. 

Also Read: వివేకా హత్య కేసు: మరోసారి సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి..

ఈ కోణంలో సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్లు అవినాష్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని, వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నందున మంగళవారం సీబీఐ ఎదుట హాజరుకావడంతో అవినాష్ రెడ్డికి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే అందుకు  హైకోర్టు నిరాకరించింది.

ఇక, సీబీఐ ఈ కేసుకు సంబంధించిన డైరీని సీల్డ్ కవర్‌లో సమర్పించింది. హత్య స్థలంలో దొరికిన లేఖ, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికతో పాటు 35 మంది సాక్షుల వాంగ్మూలం, 10 డాక్యుమెంట్లు, కొన్ని ఫొటోలు, హార్డ్ డిస్క్‌లను కోర్టు ముందు ఉంచింది. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారని అవినాష్‌రెడ్డిపై కూడా ఆరోపణలు ఉన్నాయని సీబీఐ న్యాయవాది వాదించారు.

PREV
click me!

Recommended Stories

PSLV-C62 EOS-N1 Launch: ఇస్రో ప్రయోగంపై సైంటిస్టులు, స్టూడెంట్స్ రియాక్షన్ | Asianet News Telugu
Minister Satya Kumar Yadav Highlights Importance of Blood Donation | BloodCamp | Asianet News Telugu