జూలై మాసంలో విశాఖ నుండి పాలన: మంత్రులకు జగన్ వార్నింగ్

By narsimha lodeFirst Published Mar 14, 2023, 3:32 PM IST
Highlights

జూలై నుండి  విశాఖ నుండి  పాలన సాగిస్తామని  ఏపీ సీఎం  వైఎస్ జగన్  తేల్చి  చెప్పారు. 

అమరావతి: జూలై  నుండి  విశాఖ నుండి పాలనను కొనసాగిస్తానని  ఏపీ సీఎం వైఎస్  జగన్  తేల్చి చెప్పారు.  విశాఖ నుండి  పాలనకు  మంత్రులు  సిద్దంగా  ఉండాలని  సీఎం  స్పష్టం  చేశారు. మంగళవారంనాడు  ఏపీ కేబినెట్  లో  ఎజెండా అంశాలు  ముగిసిన  తర్వాత  మంత్రులతో రాజకీయ అంశాలపై  సీఎం జగన్ చర్చించారు. 

కొందరు మంత్రుల తీరుపై  ఏపీ సీఎం  జగన్  ఆగ్రహం వ్యక్తం చేశారు.  మీ పనితీరును  గమనిస్తున్నానని  ఆయన  వ్యాఖ్యానించారు. పనితీరును మార్చుకోని  మంత్రులను తప్పించేందుకు  కూడా  సిద్దమని  జగన్  తేల్చి చెప్పారు.  అవసరమైతే మంత్రివర్గంలో  మార్పులు  చేర్పులు  చేసేందుకు  వెనుకాడనని  ఆయన  స్పష్టం  చేశారు.  

ఎమ్మెల్యే  కోటా  ఎమ్మెల్సీలు  గెలవాల్సిందేనని   ఆయన తేల్చి  చెప్పారు.  ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకోనేది లేదన్నారు. ప్రతిపక్షాలు  చేసే విమర్శలను తిప్పికొట్టాలని  జగన్ మంత్రులకు  సూచించారు.  

తెరపైకి మూడు రాజధానుల అంశం

ఏపీలో   వైసీపీ  అధికారంలోకి వచ్చిన  తర్వాత  మూడు రాజధానుల అంశాన్ని  తెరమీదికి తీసుకు వచ్చింది.. 2014లో  చంద్రబాబునాయుడు సీఎంగా  ఉన్న సమయంలో  అమరావతిని  రాజధానిగా  ప్రకటించారు. అమరావతిలో రాజధానికి  శంకుస్థాపన  కూడా  చేశారు రాష్ట్రంలోని అన్ని  ప్రాంతాలను అభివృద్ది  చేయాలనే ఉద్దేశ్యంతో  మూడు  రాజధానుల అంశాన్ని  వైసీపీ తెరమీదికి తీసుకువచ్చింది.  మూడు రాజధానులను  వైసీపీ మినహా రాష్ట్రంలోని  అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

వచ్చే ఎన్నికల నాటికి  విశాఖ నుండి  పాలన  సాగించాలనే పట్టుదలతో  జగన్  ఉన్నారు. అయితే  ఈ విషయమై  కోర్టుల్లో  కేసులున్నాయి. కోర్టు కేసులను  క్లియరైన తర్వాత   విశాఖ నుండి పాలనను సాగించాలని జగన్  సర్కార్ భావిస్తుంది.   మూడురాజధానుల అంశంపై  ఏపీ హైకోర్టు  ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో  జగన్ సర్కార్ సవాల్  చేసింది.  ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టులో  త్వరగా విచారణకు  వచ్చేలా  జగన్ సర్కార్  ప్రయత్నాలు  చేస్తుంది. 

మూడు రాజధానుల అంశాలపై  ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై  కొన్ని అంశాలపై సుప్రీంకోర్టు  స్టే ఇచ్చింది.  మూడు రాజధానుల విషయంలో  న్యాయ పరమైన ఇబ్బందులు  లేకుండా   చూసుకోవాలని  జగన్ సర్కార్ భావిస్తుంది.  

also read:న్యాయ కోవిదుడైన గవర్నర్ చేత అబద్ధాలు.. ప్రసంగంలో రాజధాని అంశమేది : సర్కార్‌పై పయ్యావుల ఫైర్

ఇదిలా ఉంటే  ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు  ఇవాళ  ప్రారంభమయ్యాయి.  ఈ బడ్జెట్ సమావేశాలు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో  ప్రారంభమయ్యాయి . గవర్నర్ ప్రసంగంలో  మూడు రాజధాను అంశాన్ని మాత్రం  లేదు. కానీ కేబినెట్ సమావేశంలో  మాత్రం  జగన్  విశాఖ నుండి  పాలన  సాగిస్తామని  ప్రకటించారు.  ఈ నెల  3,4 తేదీల్లో  జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో  విశాఖ పరిపాలన రాజధానిగా మారనుందని  ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 
 

click me!