మండపేటలోయువకుడి ఆత్మహత్య.. మర్మావయవాల వద్ద గాయాలు.. సీఐ కొట్టడంతోనే చనిపోయాడని ఆందోళన..

Published : Mar 09, 2022, 10:37 AM IST
మండపేటలోయువకుడి ఆత్మహత్య.. మర్మావయవాల వద్ద గాయాలు.. సీఐ కొట్టడంతోనే చనిపోయాడని ఆందోళన..

సారాంశం

తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎస్సై కొట్టడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

మండపేట :  East Godavari జిల్లా మండపేటకు చెందిన ఓ యువకుడు మంగళవారం suicide చేసుకున్నాడు. సీఐ కొట్టడం వల్లే  చనిపోయాడని అతని బంధువులు ఆరోపిస్తూ dead bodyతో నాలుగు గంటలపాటు ఆందోళన చేశారు. సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఆందోళన కొనసాగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  అనంతర పరిణామాల్లో..  ci దుర్గా ప్రసాద్ ను వీఆర్ కు పంపినట్లు డిఎస్పి బాలచంద్రారెడ్డి తెలిపారు.  తొలి ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇవి..

మండపేటకు చెందిన ప్రగడ కాళీ కృష్ణ భగవాన్ (కాళీ) (20) హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా మండపేటలోనే ఉంటూ తండ్రికి వ్యవసాయంలో సహకరిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బాలికతే ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో బాలిక తల్లి తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రికి డబ్బు అవసరమైతే కూడా కాళీయే సర్దాడని అతడి బంధువులు చెప్పారు. అయితే, బాలిక తల్లి మాత్రం, తమ కుమార్తెతో కాళీ చనువుగా ఉండకుండా చూడాలని మండపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. టౌన్ సీఐ దుర్గాప్రసాద్ కాళీని ఆదివారం స్టేషన్ కు పిలిచి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అతడ్ని కొట్టారని, మర్మావయవాల వద్ద గాయాలయ్యాయని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. 

ఒక రోజంగా ఒళ్లు నొప్పులతో బాధపడటంతో స్థానిక వైద్యుడికి చూపించామని, మంగళవారం ఉదయం ఇంటినుంచి బైటికి వెళ్లి రాకపోవడంతో వెతకగా ఏడిద రోడ్డులో మరణించి ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో అక్కడ నుంచి కలువపువ్వు సెంటరుకు తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేసేవరకూ కదిలేది లేదని, సీఐని సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ బాలచంద్రారెడ్డి బాధితులతో చర్చించారు. 

సీఐని పిలిపించాలని బాధితులు పట్టుబట్టారు. ఇంతలో వైసీపీ, జనసేన నాయకులూ అక్కడకు చేరుకున్నారు. బాధితులు ఎవరిపై ఫిర్యాదు చేస్తే వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు డీఎస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు. అప్పటికీ ఆందోళనకారులు వెళ్లకపోగా... సీఐని పిలిపించకపోతే.. ఆత్మాహుతికి పాల్పడతామని మృతుడి సోదరులు అనడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అప్పటికే సర్కిల్ పరిధిలోని సీఐ, నలుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఇతర పోలీసులను సంఘటన స్థలంలో మోహరించారు. బాధితులను ఒప్పించడంతో ఎట్టకేలకు మృతదేహాన్ని పోస్టు మార్టానికి తరలించారు. 

ఇదిలా ఉండగా, నిన్న శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే దీనికి పోలీసుల వేధింపులే కారణం అని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగిలో TDP కార్యకర్త వెంకట్రావు suicide చేసుకున్నాడు. social mediaల్లో అధికార పార్టీని ప్రశ్నించినందుకు కేసుల పేరుతో పోలీసులు భయపెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల వేధింపులు భరించలేకే వెంకట్రావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు.

deadbodyని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల కుటుంబాన్ని తేదేపా నాయకురాలు గౌతు శిరీష, నేతలు పరామర్శించారు. కార్యకర్త ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని ఆస్పత్రి వద్ద బైఠాయించారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu