మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు... పిల్లల సంరక్షణ సెలవులు 180 రోజులకు పెంపు..

By SumaBala Bukka  |  First Published Mar 9, 2022, 9:50 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ నిమిత్తం ఇచ్చే సెలవులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ సెలవులు 60 నుంచి 180 రోజులకు పెరిగాయి. పిల్లల దత్తత సమయంలోనూ సెలవులు తీసుకునే వెసులుబాటు కల్పించింది. 


అమరావతి : andhrapradeshలోని ఉద్యోగినులకు Child care సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 11 వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగుల సెలవులకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం రాత్రి Ministry of Finance ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ss rawat  విడుదల చేశారు.  వివరాలు ఇలా ఉన్నాయి..

- పిల్లలను దత్తత తీసుకునే ఉద్యోగినులకు దత్తత సెలవు 180 రోజుల వరకూ మంజూరు చేస్తారు. ఇద్దరు పిల్లలు లోపు ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. ఒక ఏడాది లోపు వయసున్న వారిని దత్తత తీసుకున్నపుడు సెలవు ఇస్తారు. పురుష ఉద్యోగులకు ఇలాంటి సందర్భాల్లో పితృత్వ సెలవు  పదిహేను రోజులు ఇస్తారు. పెళ్లి చేసుకోని పురుషులు, భార్య మరణించిన వారికి, విడాకులు తీసుకున్నవారికి ఇది వర్తిస్తుంది.  పిల్లలను దత్తత తీసుకున్న ఆరు నెలల లోపు ఈ సెలవు వినియోగించుకోవాల్సి ఉంటుంది. సెలవు కాలానికి జీతం ఇస్తారు.

Latest Videos

- దత్తత తీసుకునే పిల్లల వయసు నెలరోజుల లోపు ఉంటే..  ఆ సెలవు  ఏడాది పాటు కూడా తీసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఒకవేళ 6-7  నెలల మధ్య వారైతే  ఆరు నెలల పాటు సెలవు తీసుకునే వెసులుబాటు ఉంది.

- పిల్లల సంరక్షణకు తీసుకునే సెలవు తమ ఉద్యోగ కాలం  మొత్తం మీద  180  రోజుల పాటు  మహిళ ఉద్యోగులు తీసుకోవచ్చు. 

- ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేసే నర్సింగ్ సిబ్బందికి,  ఎముకలు,  అవయవాలు పరంగా ఇబ్బంది ఉన్న  ఉద్యోగులు,  ఉద్యోగినులకు  ప్రత్యేక  సాధారణ ఏడాదికి ఏడు రోజుల పాటు వర్తింప చేయనున్నారు. 

- కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్, క్షయ, కుష్టు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి అసాధారణ సెలవు మంజూరు చేయడంతో పాటు ఆ సమయంలో ఇచ్చే ఎక్స్గ్రేషియా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు.  ఎన్జీవోలో మూల వేతనం రూ. 35,570కి పరిమితం చేస్తూ ఎక్స్గ్రేషియా కనీసం రూ.11,560,  గరిష్టంగా రూ.17,780  చెల్లిస్తారు. చివరి గ్రేడు  ఉద్యోగికి కనీసం రూ.10వేలు గరిష్ఠంగా రూ.15 గా వేలు చెల్లిస్తారు. 
 

click me!