ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపటి ఢిల్లీ పర్యటన రద్దు.. కారణమిదే..?

By Siva Kodati  |  First Published Sep 24, 2021, 8:55 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి రేపటి ఢిల్లీ పర్యటన రద్దయ్యింది. ఉదయం వ్యాయామం సమయంలో సీఎం జగన్‌కు కాలు బెణికింది. సాయంత్రానికి కూడా కాలు నొప్పి తగ్గకపోవడంతో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రద్దు అయినట్లు సీఎంవో వర్గాలు ప్రకటించాయి. 
 
మావోయిస్టు ప్రభావిత సీఎంల సమావేశంలో పాల్గొనేందుకు జగన్ ఢిల్లీ వెళ్లాల్సి వుంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ కి వెళ్లాలి. గన్నవరం నుండి నేరుగా ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే గడుపుతారు. అలాగే కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో కేసీఆర్ భేటీ కానున్నారు.    

Latest Videos

click me!