యువతి మాట్లాడలేదని... ఉరేసుకున్న యువకుడు..

Bukka Sumabala   | Asianet News
Published : Jan 25, 2021, 02:28 PM IST
యువతి మాట్లాడలేదని... ఉరేసుకున్న యువకుడు..

సారాంశం

ఇష్టపడిన యువతి మాట్లాడడం లేదంటూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని నర్సీపట్నంలో ఈ ఘటన విషాదాన్ని నింపింది. తాను ఇష్టపడిన యువతి కొన్నాళ్లుగా మాట్లాడకపోవడంతో మనస్తాపానికి గురైన నర్సీపట్నం వెంకునాయుడు పేటకు చెందిన డ్రైవర్ తుమ్మల రమేష్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అవివాహితుడైన రమేష్ (24)కి గబ్బాడ గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఉంది. ఆమె తనతో మాట్లాడకపోవడంతో వేదనకు గురయ్యాడు. తాను చనిపోతున్నానంటూ స్నేహితులకు ఈ నెల 21న ఫోన్ లో మెసేజ్ పెట్టాడు. ఆందోళన చెందిన స్నేహితులు వెళ్లి చూసేసరికి బాగానే ఉన్నాడు.

ఇదే మాదిరిగా మరో రెండు సార్లు మెసేజ్ లు పెట్టాడు. అతని నుంచి ఇలాంటి మెసేజ్ లు సాధారణమేనని స్నేహితులు పట్టించుకోలేదు. శనివారం ధర్మసాగరం పమీపంలోని జీడి తోటల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి కేసు నమోదు చేశారు. 
 
PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu