జగన్ ప్రభుత్వానికి షాక్: పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

By narsimha lode  |  First Published Jan 25, 2021, 2:18 PM IST


అమరావతి: సుప్రీంకోర్టుల ఏపీ సర్కార్ కు చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.


అమరావతి: సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ సంజయ్ కౌశల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం నాడు విచారించింది. ఏపీ ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేసింది. ఈ రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది.

Latest Videos

undefined

 

సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. pic.twitter.com/bDMd002qIJ

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఈసీకి దురుద్దేశాలు ఆపాదించారని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎన్నికలకు అడ్డంకి కానేకాదని సుప్రీం తేల్చి చెప్పింది.

రాజ్యాంగ ఉల్లంఘనలను ఆమోదించబోమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం కుదదరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్న తీరును కూడ సుప్రీంకోర్టు తప్పు బట్టింది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉద్యోగ సంఘాలు ఇందులో ఇన్ వాల్వ్ కావడం అసంబద్దమైన చర్యగా కోర్టు అభిప్రాయపడింది.

స్థానిక సంస్థల ఎన్నికలను కనీసం ఈ ఏడాది మార్చి వరకు వాయిదా వేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం అందుకు ససేమిరా అని తేల్చి చెప్పింది.

ఈ నెల 21వ తేదీన ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ హైకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అదే రోజున దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. 

ఈ నెల 8వ తేదీన ఏపీ ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది.ఈ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ షెడ్యూల్ ను హైకోర్టు సింగిల్ జడ్జి ఈ నెల 11వ తేదీన సస్పెండ్ చేసింది. 

ఈ ఆదేశాలను ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు ధర్మాసనంలో సవాల్ చేసింది. హైకోర్టు ధర్మాసనం సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేసింది.


 

click me!