ప్రాణం తీసిన కుక్క పిల్ల..!

Published : Jun 16, 2021, 08:39 AM IST
ప్రాణం తీసిన కుక్క పిల్ల..!

సారాంశం

సోమవారం తల్లి బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఆన్ లైన్ లో చూసిన కుక్కపిల్ల కొనివ్వలేదని ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన విశాఖపట్నంలో  చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వెంకటేశ్వర మెట్ట ప్రాంతానికి చెందిన షణ్ముక వంశీ(17) ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయాడు. ఆన్‌లైన్‌లో చూసిన రూ.10వేల విలువైన కుక్కపిల్ల కావాలని తల్లిని వంశీ కోరారు. ఇంటర్ ముగిసిన తర్వాత కొందామని పేరెంట్స్ చెప్పారు. 

తాను అడగగానే కొనివ్వలేదని వంశీ మనస్తాపం చెందాడు.  సోమవారం తల్లి బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా... ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కుక్క పిల్ల కోసం ప్రాణాలు తీసుకోవడం దారుణమని స్థానికులు అభిప్రాయపడ్డారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం