ఎస్సై కారును ఓవర్ టేక్ చేసి... స్టేషన్ మెట్లెక్కిన యువకులు

Arun Kumar P   | Asianet News
Published : Jun 07, 2021, 09:31 AM IST
ఎస్సై కారును ఓవర్ టేక్ చేసి... స్టేషన్ మెట్లెక్కిన యువకులు

సారాంశం

పోలీసుతోనే వాగ్వాదానికి దిగి చివరకు పోలీస్ స్టేషల్ మెట్లెక్కారు ఇద్దరు యువకులు. 

విశాఖపట్నం: మితిమీరిన వేగంతో ఇతర వాహనదారులను ఇబ్బందిపెడుతూ వెళ్లడమే కాదు ఇదేంటని అడిగిన ఓ ఎస్సైతోనే దురుసుగా ప్రవర్తించారు ఇద్దరు యువకులు. ఇలా పోలీసుతోనే వాగ్వాదానికి దిగి చివరకు పోలీస్ స్టేషల్ మెట్లెక్కాల్సి వచ్చింది. 

విశాఖలోని పీఎం పాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు మితిమీరిన వేగంతో వెళుతూ ఎస్సై నిహార్ కారును ప్రమాదకర రీతిలో ఓవర్  టేక్ చేశారు. దీంతో ఎస్సై వారిని మందలించే ప్రయత్నం చేయారు. అయితే ఎస్సై మాటలు వినిపించుకోకుండా యువకులిద్దరూ ఎస్పైతో దురుసుగా ప్రవర్తించారు. 

దీంతో ఎస్సై నిహాల్ తన సిబ్బంది సహాయంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకులిద్దరూ గోపాలపట్నంకు చెందిన వారిగా గుర్తించారు.  
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్