జగన్‌పై వ్యాఖ్యల వెనుక కుట్ర.. పట్టాభి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

By Siva KodatiFirst Published Oct 21, 2021, 8:20 PM IST
Highlights

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy pattabhi).. సమాజంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో (remand report) పేర్కొన్నారు పోలీసులు. సీఎం జగన్‌పై (ys jagan) అనుచిత వ్యాఖ్యల వెనుక కుట్ర వుందని అభిప్రాయపడ్డారు.

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy pattabhi).. సమాజంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో (remand report) పేర్కొన్నారు పోలీసులు. సీఎం జగన్‌పై (ys jagan) అనుచిత వ్యాఖ్యల వెనుక కుట్ర వుందని అభిప్రాయపడ్డారు. ఈ తరహా వ్యాఖ్యలతో ఇప్పటికే పట్టాభిపై నాలుగు కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. విజయవాడలో పట్టాభి ఘర్షణలు సృష్టిస్తున్నారని స్పష్టమైందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నవంబర్ 2 వరకు పట్టాభికి రిమాండ్ విధించింది కోర్ట్. దాంతో ఆయనను మచిలీపట్నం సబ్‌జైలుకు (machilipatnam sub jail) తరలించారు పోలీసులు. 

అంతకుముందు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (ys jagan mohan reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి న్యాయస్థానం నవంబర్ 2 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే పట్టాభి తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. మరోవైపు ఈ కేసులో ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు గాను పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అంతకుముందు గురువారం విజయవాడలోని మూడో అడిషనల్ మెట్రోపాలిటిన్ కోర్టులో పట్టాభిని హాజరుపరిచారు. తన ఇంటిపై చాలా సార్లు దాడి చేశారని.. పట్టాభి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా వవిమర్శించలేదని.. ప్రభుత్వంలో వున్న లోపాలనే ప్రస్తావించానని పట్టాభి చెప్పారు. 

ALso Read:ఢిల్లీకి చేరిన ఏపీ పంచాయతీ: రేపు అమిత్ షాను కలవనున్న చంద్రబాబు.. పోటీగా వైసీపీ కూడా

బుధవారం రాత్రి పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు .. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ(గురువారం) అతడిని వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో pattabhi ని పోలీస్ వాహనాలను టిడిపి శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ నుండి ప్రత్యేక వాహనంలో పట్టాభి తరలిస్తున్నట్లు తెలుసుకున్న TDP శ్రేణులు అడ్డుకోడానికి ప్రయత్నించారు. తమకు పట్టాభిని చూపించాలంటు పోలీస్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు వారిని ఈడ్చుకుంటూ పక్కకు తీసుకెళ్లారు. పోలీసులు, టిడిపి శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుని కాస్సేపు ఉద్రిక్తత ఏర్పడింది. 

ఇదిలావుంటే టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కూడా అమరావతికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. తాను ఓ ఎమ్మెల్యేగా సెక్రటేరియట్ కు వెళుతున్నానని...ఎందుకు అడ్డుకుంటున్నారని గోరంట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతిభద్రతల సమస్య వుంది కాబట్టి పంపించడం లేదంటూ ఏలూరు వద్ద gorantla butchaiah ను పోలీసులు అడ్డుకున్నారు.
 

click me!