
నంద్యాలలో టీడీపీ గెలవకుంటే ఎల్లో మీడియాకు బతుకు లేదని ఎద్దేవా చేశారు వైసీపి నేత అంబటి రాంబాబు. అందుకు టీడీపీ నేతలతో పాటు కొన్ని పత్రికలు కూడా అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయని విరుచుకుపడ్డారు అంబటి. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పై మండిపడ్డారు.
వైసీపి పై బురద జల్లడమే ఎల్లో మీడియా లక్ష్యంగా పని చేస్తుందని అరోపించారు అంబటి. గంగుల ప్రతాపరెడ్డి వైఎస్‌ఆర్ సీపీని వీడి టీడీపీలో చేరినట్లు కొన్ని చానళ్లు, పత్రికల ద్వారా జరిగిన ప్రచారం అవాస్తవమన్నారు. అస్సలు గంగుల తమ పార్టీ సభ్యుడు కాదన్నారు. అలాంటప్పుడు ఎందుకు తమ పై అబద్దపు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అండ లేకుండా బతకలేమని పచ్చ మీడియా భావిస్తోందని అంబటి మండిపడ్డారు.
పత్రికలు నిజాలను ప్రచురించాలన్నారు, కొన్ని పత్రికలు చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాలు ప్రచురించే ధైర్యం పచ్చ పత్రికలు, ఛానల్స్ చేయడం లేదన్నారు. అబద్దపు ప్రచారం ద్వారా నంద్యాల్లో టీడీపీ గెలుపు కోసం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. టీడీసీ నంద్యాల్లో విజయం సాధించకపోతే భవిషత్త్యు ప్రశ్నార్థకం అని ఎద్దేవా చేశారు.