కార్యకర్తలే లేని పార్టీకి అనుబంధ సంఘాలా?

Published : Aug 17, 2017, 04:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
కార్యకర్తలే లేని పార్టీకి అనుబంధ సంఘాలా?

సారాంశం

అంతా బాగానే ఉందిగానీ అసలు పార్టీకి ఇంతవరకూ ఓ కార్యవర్గమే  ఏర్పాటు కాలేదు. ఇప్పటి వరకూ జనసేనకు హోల్ అండ్ సోల్ పవన్ మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. కార్యవర్గంతో పాటు కార్యకర్తలు కూడా లేని పార్టీకి అనుబంధ సంఘాల ఏర్పాటేమిటో పవన్ కే తెలియాలి.

సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైఖరి ఎవరికీ అర్ధం కాదు. త్వరలో జనసేన విధి, విధానాలు ప్రకటిస్తారట. ఈ ఏడాదిలోగానే మహిళ, యువత అనుబంధ సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వీలైనంత త్వరగా జనసేనను విస్తరించాలని అనుకుంటున్నట్లు పవన్ ప్రకటించారు. అంతా బాగానే ఉందిగానీ అసలు పార్టీకి ఇంతవరకూ ఓ కార్యవర్గమే  ఏర్పాటు కాలేదు. ఇప్పటి వరకూ జనసేనకు హోల్ అండ్ సోల్ పవన్ మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. కార్యవర్గమే లేని పార్టీకి అనుబంధ సంఘాల ఏర్పాటేమిటో పవన్ కే తెలియాలి.

ఇప్పటివరకూ జనసేన అధికారికంగా చేసిన కార్యక్రమం ఏదైనా ఉందా అంటే అది ప్రాంతాల వారీగా కంటెంట్ రైటర్స్, స్పీకర్స్ తదితర పోస్టులకు పరీక్షలు నిర్వహించటమే. ఆ పరీక్షల ఫలితాలేంటో కూడా మళ్ళీ ఇంత వరకూ ప్రకటించలేదు. అప్పుడప్పుడు ఎవరో ఒకరో, ఇద్దరో మాత్రం టివి చర్చల్లో జనసేన తరపున మాట్లాడుతున్నామని చెప్పుకోవటం మినహా పార్టీ నిర్మాణమే లేదు. పార్టీ పెట్టి సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకూ కార్యవర్గమే ప్రకటించలేదంటేనే పార్టీ నిర్మాణంపై పవన్ కున్న సీరియస్ నెస్ అర్ధమవుతోంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?