రైతుల పాదయాత్రపై వైసీపీ కుతంత్రాలు సాగవు - టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

By team teluguFirst Published Oct 22, 2022, 2:57 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఎప్పటికీ నిలిచిపోతుందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 28 వేల రైతుల త్యాగం వల్ల రాజధాని అమరావతి ఏర్పడిందని చెప్పారు. 

రైతుల మహా పాదయాత్రపై వైసీపీ కుతంత్రాలు సాగబోమని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏడు సంవత్సరాల కిందట అక్టోబరు 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారని తెలిపారు. దాదాపు 1000 సంవత్సరాలు తెలుగు ప్రజలు గుండె చప్పుడుగా అమరావతి సిటి నిలబడుతుందని అందరూ ఆ సమయంలో అనుకున్నారని అన్నారు. కానీ ప్రస్తుత పాలకుల ఆలోచనల వల్ల ఆ ఆకాంక్షలు మొత్తం నాశనం అయ్యాయని చెప్పారు.

దీపావళి ఆఫర్.. వారంపాటు ట్రాఫిక్ ఛలాన్లు లేవు.. ఫైన్లు లేవు.. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

Latest Videos

28 వేల రైతుల త్యాగం వల్ల రాజధాని అమరావతి ఏర్పడిందని అన్నారు. కోట్ల మంది సంకల్పం అమరావతి అని చెప్పారు. అన్ని ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రా ప్రజలు అమరావతిని ఆరాధించారని అన్నారు. అమరావతి పట్ల గర్వంగా ఉన్నారని చెప్పారు. ఎలక్షన్స్ కు ముందు అమరావతిని స్వాగతించిన మనిషి.. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి రాగానే మాట మార్చారని ప్రజలను మోసం చేశారని చెప్పారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు..

ఆంధ్రా ప్రజల రాజధాని ఎప్పుడూ అమరావతే అని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. అమరావతి మళ్లీ నిలబడుతుందని, ఊపిరి పీల్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రా ప్రజల ఆకాంక్ష కచ్చితంగా నెరవేరుతుందని తెలిపారు. అమరావతి ఎప్పటికీ నిలబడుతుందని అన్నారు. ఈ రాజధానికి సత్యం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్నాయని పేర్కొన్నారు. అమరావతి తప్పకుంగా గెలుపొందుతుందని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

click me!