జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు..

By Sumanth KanukulaFirst Published Oct 22, 2022, 11:58 AM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. మూడు పెళ్లిళ్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఏపీ మహిళా కమిషన్ కోరింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. మూడు పెళ్లిళ్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఏపీ మహిళా కమిషన్ కోరింది. భరణమిస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశమిచ్చేలా పవన్ కల్యాణ్ మాటలున్నాయని పేర్కొంది. రూ. కోట్లు, రూ. లక్షలు, రూ. వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఉంటుందా అని ప్రశ్నించింది. మహిళలను ఉద్దేశించి స్టెపినీ అనే పదం పవన్ కల్యాణ్ ఉపయోగించడం ఆక్షేపణీయం అని పేర్కొంది. చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలను పవన్ వెనక్కి తీసుకోవాలని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. మహిళా లోకానికి పవన్ కల్యాణ్ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఇక, ఇటీవల జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. . ప్యాకేజ్ స్టార్‌ అని తప్పుడు ఆరోపణలు చేస్తే వైసీసీ నాయుకులను చెప్పు తీసుకోని కొడతానని తీవ్రవ్యాఖ్యలు చేశారు. తన చెప్పు తీసి మరి చూపించారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని పదే పదే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. విడాకులు ఇచ్చే తాను పెళ్లిళ్లు చేసుకున్నానని చెప్పారు. చట్టప్రకారమే వారికి భరణం చెల్లించానని తెలిపారు.

అయితే ఈ వ్యాఖ్యలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు ఏం చేయనివారు, చెప్పుకోవడానికి ఏం లేనివారే బూతులు తిడుతున్నారని విమర్శించారు. వీధి రౌడీలు కూడా అలాంటి మాటల మాట్లాడరేమోనని అన్నారు. చెప్పులు చూపిస్తూ దారుణమైన మాటలు మాట్లాడుతుంటే వీళ్లేనా మన నాయకులు అని బాధ అనిపిస్తోంది. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏం మాట్లాడిస్తున్నామో కూడా చూస్తున్నామని అన్నారు. మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని తాము చెబితే.. కాదు మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని అంటున్నారని ఎద్దేవా చేశారు. వీరు కూడా చేసుకోండి అని ఏకంగా టీవీల్లోనే చెబుతున్నారని విమర్శించారు. 

ఇలా మాట్లాడితే ఇళ్లలోని ఆడవాళ్ల పరిస్థితేమిటి అనేది ఆలోచన చేయాలి. ఇలా ప్రతి ఒక్కరు కూడా నాలుగేళ్లు, ఐదేళ్లు కాపురం చేసి.. ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్లీ పెళ్లిచేసుకోవడం మొదలు పెడితే.. వ్యవస్థ ఏం బుతుకుతుందని అన్నారు. ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం  కావాలి?.. అక్కాచెల్లెమ్మల జీవితాలు ఏం  కావాలి? అని ప్రశ్నించారు ఇలాంటి వాళ్ల మనకు నాయకులు అని ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. 

click me!