గ్రామ పంచాయతీ ఎన్నికలు: కుప్పంలో చంద్రబాబుకు షాక్

By telugu teamFirst Published Feb 18, 2021, 7:23 AM IST
Highlights

తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అదినేత నారా చంద్రబాబు నాయుడికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో షాక్ తగిలింది. మెజారిటీ పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుంది.

అమరావతి: తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి షాక్ తగిలింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ విజయ ఢంకా మోగించింది. కుప్పం నియోజకవర్గం పరిధిలోని 89 గ్రామ పంచాయతీలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. 

వైసీపీ 74 చోట్ల విజయం సాధించగా, టీడీపీ 14 పంచాయతీల్లో మాత్రమే గెలిచింది. కాంగ్రెసు మద్దతుదారు ఒక చోట గెలిచారు. కుప్పం మండలంలోని 26 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు 21, టీడీపీ మద్దతుదారులు 5 చోట్ల విజయం సాధించారు. 

గుడుపల్లె మండలంలోని 18 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు 13, టీడీపీ 4, కాంగ్రెసు మద్దతుదారులు 1 చోట విజయం సాధించారు. శాంతిపురం మండలంలోని 23 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 20, టీడీపీ 3 పంచాయతీలు గెలుచుకున్నాయి. రామకుప్పం మండలం 22 పంచాయతీలకు గాను వైసీపీ 20 పంచాయతీల్లో, టీడీపీ మద్దతుదారులు 2 పంచాయతీల్లో విజయం సాధించారు. 

మూడో విడత బుధవారంనాడు 3,2221 పంచాయతీలకు ఎన్నికలు జరగియాయిత ఇందులో 579 ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో వైసీపీ 549 గెలువగా, టీడీపీ  మద్దతుదారులు 13 చోట్ల గెలిచారు. ఇతరులు 17 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. బుధవారంనాడు 2,639 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. 

బుధవారం పోలింగ్ జరిగిన పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు 2,442 పంచాయతీల్లో విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారులు 501 చోట్ల విజయం సాధించారు. ఇతరులు 145 చోట్ల గెలిచారు. 

click me!