కొత్తగా 51 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,89,010కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Feb 17, 2021, 07:12 PM IST
కొత్తగా 51 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,89,010కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా  కేసులు తగ్గిపోతూనే వున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 51 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 8,89,010కి చేరింది. 

నిన్న కోవిడ్ వల్ల ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదు. నేటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 7,165కి చేరింది. గడిచిన 24 గంటల్లో 57 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,81,238కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 607 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 26,474 మందికి కోవిడ్ నిర్థరాణ పరీక్షలు నిర్వహించగా.. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 1,36,15,847కి చేరుకుంది.

నిన్న ఒక్కరోజు అనంతపురం 4, చిత్తూరు 14, తూర్పు గోదావరి 3, గుంటూరు 4, కడప 1, కృష్ణా 6, కర్నూలు 2, నెల్లూరు 3, ప్రకాశం 0, శ్రీకాకుళం 1, విశాఖపట్నం 8, విజయనగరం 2, పశ్చిమ గోదావరిలలో 3 కేసులు చొప్పున నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu