దాడి చేయించింది నందిగం సురేష్.. వెనకుంది జగన్ మాస్టర్ ప్లాన్ : బీజేపీ

By SumaBala BukkaFirst Published Apr 1, 2023, 8:14 AM IST
Highlights

బీజేపీ నేతల కార్లమీద రాళ్లు రువ్వింది తాళ్లయిపాలెంకి చెందిన దున్న నితిన్ అలియాస్ జార్జిగా పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. 

అమరావతి : బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మీద వైసిపి కార్యకర్తలు దాడి చేశారు. అమరావతి రాజధాని రైతు ఉద్యమానికి సత్య కుమార్ సంఘీభావం తెలిపి తిరిగి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభమై నిన్నటికి 1200 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా సత్యకుమార్ వారికి మద్దతు పలికి తిరిగి వస్తుండగా.. ఆయన వాహనశ్రేణి మీద రాళ్లు, కర్రలతో వైసిపి కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు. ఈ దాడి జరుగుతున్న క్రమంలో అక్కడ పోలీసులు ఉన్నా కూడా వారు కలగజేసుకోలేదు. 

దీంతో వైసిపి కార్యకర్తలు విధ్వంసాన్ని సృష్టించారు. బిజెపి కార్యకర్త,  సత్యకుమార్ కు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న కాశయ్య యాదవ్ ను తీవ్రంగా కొట్టారు. చేతులు పట్టుకుని ఈడ్చుకు వెళ్లారు. బిజెపి దళిత నాయకుడు పణతల సురేష్ తో పాటు మరికొందరు కార్యకర్తల మీద ఇలాగే దాడి చేసి కొట్టారు. ఈ దాడి ఘటనలో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ప్రయాణిస్తున్న వాహనం మీద వైసీపీ శ్రేణులు రాళ్లు విసిరారు. కర్రలతో దాడి చేశారు. ఆదినారాయణ రెడ్డి ఎక్కడ? సత్య కుమార్ ఎక్కడ? అంటూ వెతికారు.

కౌన్సిల్ సమావేశానికి పెట్రోల్ సీసాతో వచ్చిన కౌన్సిలర్.. ఆత్మహత్య చేసుకుంటూనంటూ హల్ చల్.. ఎందుకంటే...

సత్యకుమార్ కు ప్రమాదం ఉన్న విషయాన్ని గమనించిన బిజెపి శ్రేణులు ఆయన వాహనం చుట్టూ కవచంలా నిలబడ్డారు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ఆదినారాయణ రెడ్డి కొన్ని గంటలకు ముందే విజయవాడకు వెళ్ళిపోయారు. దీంతో ఆయన కూడా దాడి నుంచి తప్పించుకోగలిగారు. మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల నుంచి రెండు గంటల 15 నిమిషాల వరకు దాదాపు 20 నిమిషాలకు పైగా వైసీపీ శ్రేణుల దాడితో ఆ ప్రాంతమంతా బీభత్స వాతావరణం నెలకొంది. ఆ సమయంలో అక్కడ డీఎస్పీ సహా పదుల సంఖ్యలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇంత గలాటా జరుగుతుంటే వైసీపీ శ్రేణులను అడ్డుకోవడం పోయి బిజెపి శ్రేణులనే వారిని నియంత్రించడానికి ప్రయత్నించారు. 

పథకం ప్రకారం నాపై దాడి: బీజేపీ నేత సత్యకుమార్

దీంతో పోలీసుల కనుసన్నలలోనే దాడి జరిగిందని.. దాడికి వారి సహకారం ఉందని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. బాపట్ల వైసీపీ ఎంపీ నందిగామ సురేష్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతోనే.. పక్కా ప్లాన్ ప్రకారం.. తన అనుచరులైన వైసీపీ కార్యకర్తలతో దాడి చేయించారని బిజెపి వారు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఈ ఘటన తర్వాత  మూడు రాజధానుల శిబిరం వద్దకు వచ్చారు. మూడు రాజధానుల శిబిరంపై, ఎస్సీ, ఎస్టీ మహిళల పైనా బిజెపి నాయకులు దాడి చేశారని.. దాని వెనుక చంద్రబాబు ఉన్నారని ఆయన ఆరోపించారు. కాగా, సత్య కుమార్ వాహనం మీద  రాళ్లు రువ్వింది తాళ్లయిపాలెంకి చెందిన దున్న నితిన్ అలియాస్ జార్జి అని తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
 

click me!