కౌన్సిల్ సమావేశానికి పెట్రోల్ సీసాతో వచ్చిన కౌన్సిలర్.. ఆత్మహత్య చేసుకుంటూనంటూ హల్ చల్.. ఎందుకంటే...

By SumaBala BukkaFirst Published Apr 1, 2023, 6:52 AM IST
Highlights

తన వార్డులో యేడాది కాలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని.. ఆవేదనతో ఓ కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏకంగా కౌన్సిల్ సమావేశానికి పెట్రోల్ సీసాతో వచ్చి హల్ చల్ చేశాడు. 

ఏలూరు : ఆంధ్రప్రదేశ్ లోని జంగారెడ్డిగూడెం వైసీపీ కౌన్సిలర్ ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్ చల్ చేశాడు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపింది. తన వార్డులో అభివృద్ది పనులు జరగడం లేదని.. తన మీద వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ప్రయత్నానికి పూనుకున్నారు. వివరాల్లోకి వెడితే.. ‘నా వార్డులో అభివృద్ధి పనులకు కౌన్సిల్ లో యేడాది కిందట తీర్మానం చేశారు. కానీ ఇప్పటివరకు ఏ పనులు ప్రారంభం కాలేదు. 
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వైసీపీ కౌన్సిలర్ సుంకు సురేష్.. తన మీద వివక్ష, చులకన భావం చూపిస్తున్నారని, కక్ష పూరితంగా  వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

సీసాలో తెచ్చుకున్న పెట్రోల్ ను పోసుకొని ఆత్మహత్య  చేసుకుంటానంటూ  కలకలం రేపాడు. శుక్రవారం పురపాలక చైర్పర్సన్ బత్తిన లక్ష్మి అధ్యక్షతన జంగారెడ్డిగూడెం పురపాలక కౌన్సిల్ సమావేశం జరిగింది. సుంకు సురేష్ సమావేశం చివర్లో మాట్లాడుతూ.. తన వార్డు పరిధిలో ఉన్న సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆవేశానికి లోనయ్యారు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసా బయటకు తీసి ఆత్మహత్య చేసుకుంటానంటూ అక్కడున్న వారందరిని హెచ్చరించాడు. మరో కౌన్సిలర్ తాతాజీ సుంకు సురేష్ ను ఆపి.. అతని దగ్గరినుంచి సీసా లాగేసుకున్నాడు. 

రోడ్డెక్కిన చల్లా కుటుంబం.. వారసత్వం కోసం శ్రీలక్ష్మీ-విఘ్నేశ్వర్ రెడ్డి మధ్య పోరు, రంగంలోకి వైసీపీ హైకమాండ్

కౌన్సిల్ లోని అన్ని వార్డుల్లో పనులు జరుగుతున్నాయని సురేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన వార్డుకు వచ్చేసరికి మాత్రం  కౌన్సిల్ తీర్మానం చేసి ఏడాది దాటిపోతున్నా పనులు ప్రారంభించలేదు. దీంతో తనకు ఏడుపొస్తుందని గద్గగ స్వరంతో చెప్పాడు. చైర్ పర్సన్ అతనిని బుజ్జగిస్తూ వచ్చే సమావేశం వరకు పనులు  పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. పలు అధికార పార్టీ సభ్యులు సురేష్ కు జత కలిశారు. తమ వార్డుల్లో కూడా సురేష్ వార్డు పరిస్థితి లాగానే ఉందని పనులు జరగడం లేదని.. దీనివల్ల ప్రజలకు మొహం కూడా చూపించుకోలేకపోతున్నామని వాపోయారు.
 

click me!